స్ప్లిట్ స్క్రీన్ తో ఆండ్రాయిడ్ 6.1

Android 6.1 With Multi Tasking

04:46 PM ON 21st December, 2015 By Mirchi Vilas

Android 6.1 With Multi Tasking

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మొబైల్స్ లో వినియోగిస్తున్న ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్. త్వరలో ఆండ్రాయిడ్ కు నూతన వెర్షన్‌ అందుబాటులోకి రానుంది. గత ఏడాది మార్చిలో ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్‌ను విడుదల చేయగా, ప్రస్తుత వెర్షన్ 6.0 మార్ష్‌మాలో ఇటీవలే రిలీజ్ అయ్యింది. అయితే ఆండ్రాయిడ్ ఎన్ గా పిలవబడుతున్న ఈ నూతన వెర్షన్‌ను 7.0గా కాకుండా 6.1 పేరిటే యూజర్లకు అందించనున్నట్టు తెలిసింది. పేరు ఇంకా ఫైనలైజ్ కానప్పటికీ ఆండ్రాయిడ్ ఎన్‌లో స్క్రీన్‌పై ఒకేసారి మల్టిపుల్ అప్లికేషన్లను రన్ చేసుకునేలా స్లిట్ స్క్రీన్ మల్టిటాస్కింగ్ ఫీచర్‌ను అందించనున్నారు. దీంతోపాటు మొబైల్ పేమేంట్ సిస్టమ్ ఆండ్రాయిడ్ పే, డు నాట్ డిస్టర్బ్ మోడ్, బ్యాటరీని సేవ్ చేసే డోజ్ మోడ్ వంటి ఫీచర్లను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్ది ఆండ్రాయిడ్ 6.1 వెర్షన్‌లో అందించనున్నారు. ఈ నూతన ఫీచర్లు కలిగిన ఆండ్రాయిడ్ ఎన్‌ను రానున్న 2016 జూన్‌లో విడుదల చేయనున్నారు. ఇది యూజర్లను అమితంగా ఆకట్టుకుంటుందని గూగుల్ ప్రతినిధులు చెబుతుండగా, ఇప్పటికైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆండ్రాయిడ్ డివైస్‌లలో కేవలం 0.5 శాతం డివైస్‌లలో మాత్రమే ఆండ్రాయిడ్ మార్ష్‌మాలో 6.0 రన్ అవుతోంది. ఇక నూతన 6.1 వెర్షన్ యూజర్లను ఏ మేర ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.

English summary

Google Android 6.0 was recently released with the name Marsh Mellow and the next version of Android is to be released as Android 6.1 or 7 this os will arrive in June 2016 along with new features like Split-Screen,Multi-Tasking etc