ఆస్ట్రేలియా ఓపెన్‌ ఫైనల్ చేరిన ఆండీ ముర్రే

Andy Murray Enters Into Australian Open Finals

11:52 AM ON 30th January, 2016 By Mirchi Vilas

Andy Murray Enters Into Australian Open Finals

ఆస్ట్రేలియా ఓపెన్‌ మెన్స్ సింగిల్స్‌లో బ్రిటన్‌ స్టార్ ప్లేయర్ ఆండీ ముర్రే ఫైనల్‌కు దూసుకెళ్లాడు. శుక్రవారం ముర్రే, రోనిచ్‌(కెనడా) మధ్య జరిగిన సెమీఫైనల్‌ మ్యాచ్‌ హోరాహోరీగా సాగింది. ముర్రే షాట్లకు రోనిచ్‌ దీటుగా బదులిచ్చాడు. తొలుత జరిగిన నాలుగు సెట్లలో చెరో రెండు సెట్లు గెలిచారు. నిర్ణయాత్మకమైన ఐదో సెట్‌లో 6-2తేడాతో రోనిచ్‌పై గెలుపొందిన ముర్రే ఫైనల్లోకి అడుగుపెట్టాడు. ఐదు సెట్ల ఈపోరులో ముర్రే 4-6, 7-5, 6-7, 6-4, 6-2తో రోనిచ్‌ను ఓడించాడు. ఫైనల్‌లో సెర్బియా ఆటగాడు, వరల్డ్ నంబర్ వన్ జకోవిచ్‌తో ముర్రే తలపడనున్నాడు. గతేడాది కూడా ఫైనల్లో వీరిద్దరూ పోటీ పడగా... జకోవిచ్‌ విజేతగా నిలిచాడు. ఈసారి ఎలాగైనా ఆస్ట్రేలియా ఓపెన్‌ను దక్కించుకోవాలని చూస్తున్న ముర్రే... జకోవిచ్‌కు చెక్‌ పెట్టాలని యోచిస్తున్నాడు. మరోవైపు ఇప్పటికే ఈ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌ను ఐదుసార్లు గెలుచుకున్న జకోవిచ్‌... ఆరో టైటిల్‌ను తన ఖాతాలో వేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాడు.

English summary

World No.2 Tennis Player Andy Murray Enters Into Australian Open Finals by beating Milos Raonic in five-set Australian Open semi-final match.Andy Murray to fight with Novak Djokovic in the finals