అంగన్ వాడీ వర్కర్ల ఆందోళనతో ఉద్రిక్తత 

Anganwaadi Workers Demands For Salaries

01:42 PM ON 27th November, 2015 By Mirchi Vilas

Anganwaadi Workers Demands For  Salaries

పెంచిన జీతాలు అమలు చేయాలంటూ ఎపిలో రాష్ట్ర వ్యాప్తంగా అంగన్ వాడీ వర్కర్లు శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టరేట్ ల ముట్టడి కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విశాఖలో సరస్వతి పార్కు నుంచి అంగన్ వాడీ వర్కర్ల భారీ ర్యాలి కలెక్టరేట్ కి చేరి , ముట్టడించే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. పలువురు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు చేసారు. విజయనగరం కలెక్టరేట్ ని అంగన్ వాడీ వర్కర్లు ముట్టడించారు. ఈ సందర్భంగా ఆందోళన కారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

English summary

Anganwaadi Workers Demands to gived raised salaries which was announced by the government of andhra pradesh. They Done a big rally on vishakapatnam and vijayanagaram