ధర్నాచేసిన అంగన్వాడీలను తొలగిస్తారట 

Anganwadi Employees Suspension

06:48 PM ON 23rd December, 2015 By Mirchi Vilas

Anganwadi Employees Suspension

అవునా ... అవుననే విధంగా ఎపి ప్రభుత్వం సర్కులర్ జారీచేసింది. బుధవారం సాయంత్రం ఈమేరకు ఉత్తర్వులు వెలువడ్డాయని అంటున్నారు. దీంతో ధర్నాలో పాల్గొన్న అంగన్ వాడీలను ఉద్యోగాలనుంచి తొలగించడానికి రంగం సిద్ధం అయింది. వీడియో పుటేజ్ ఆధారంగా ఆందోళన కారులను గుర్తించే పని చేపతుడున్నారు.

వివరాలలోకి వెళితే, ఈనెల 18వ తేదీన తమ సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్ వాడీ వర్కర్లు చేపట్టిన ఆందోళనతో విజయవాడ లో ఉద్రిక్త పరిష్టితులు ఏర్పడ్డాయి. సిఎమ్ కాంప్ ఆఫీసుకు చేరుకోవాలని అంగన్ వాడీలు వివిధ జిల్లాల నుంచి వేలాదిగా విజయవాడకు చేరుకున్నారు.సిఎమ్ కాంప్ ఆఫీసు ముట్టడికి బయలు దేరిన ఆందోళన కారులను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకోవడంతో పలుచోట్ల పోలీసులకు , ఆందోళనకారులకు వాదన చోటుచేసుకుంది. కొన్ని చోట్ల తోపులాటలు జరిగాయి.బందరు రోడ్డులో ఆందోళన కారులను పోలీసులు అడ్డుకోవడంతో ఆందోళన కారులు ప్రతిఘటించారు. తోపులాట లో కొందరు మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు. అయినా కొంతమంది సిఎమ్ కాంప్ ఆఫీసుకు చొచ్చుకు వచ్చారు.అంగన్ వాడీ వర్కర్లను అదుపుచేయడం పోలీసులకు కష్టసాధ్యంగా మారడమే కాక, కొందరు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. పలువురు ఆందోళన కారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తానికి బెజవాడ అంగన్ వాడీ వర్కర్ల ఆందోళనతో అట్టుడికింది.

అయితే ఉద్యోగుల జీతాలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం కూడా తీసుకుంది. అంతా బానే వున్నా , ఇప్పుడు ప్రభుత్వం జారీచేసిన సర్క్యులర్ తో కొత్త వివాదం నెలకొంది. ఆందోళన జరిగి ఐదు రోజుల తర్వాత ప్రభుత్వం ఈ విధంగా అవ్యవహరించడం ఏమిటన్న మాట వినిపిస్తోంది. దీనిపై రియాక్షన్ ఎలా వుంతోందో చూడాలి.

English summary

On 18 th of this month Anganwadi workers concern in Vijayawada against government to solve their problems. Recently government of andhra pradesh decided to suspend the employees who were active in that concern . Ap government to decide that by seeing the video footage