అంగన్ వాడీల ఆందోళనతో ఉద్రిక్తత 

Anganwadi Workers Concern In Vijayawada

01:18 PM ON 18th December, 2015 By Mirchi Vilas

Anganwadi Workers Concern In Vijayawada

తమ సమస్యల పరిష్కారం కోరుతూ అంగన్ వాడీ వర్కర్లు చేపట్టిన ఆందోళనతో విజయవాడ లో ఉద్రిక్త పరిష్టితులు ఏర్పడ్డాయి. సిఎమ్ కాంప్ ఆఫీసుకు చేరుకోవాలని అంగన్ వాడీలు వివిధ జిల్లాల నుంచి వేలాదిగా విజయవాడకు చేరుకున్నారు.

సిఎమ్ కాంప్ ఆఫీసు ముట్టడికి బయలు దేరిన ఆందోళన కారులను ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకోవడంతో పలుచోట్ల పోలీసులకు , ఆందోళనకారులకు వాదన చోటుచేసుకుంది. కొన్ని చోట్ల తోపులాటలు జరిగాయి.

బందరు రోడ్డులో ఆందోళన కారులను పోలీసులు అడ్డుకోవడంతో ఆందోళన కారులు ప్రతిఘటించారు. తోపులాట లో కొందరు మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు. అయినా కొంతమంది సిఎమ్ కాంప్ ఆఫీసుకు చొచ్చుకు వచ్చారు.

అంగన్ వాడీ వర్కర్లను అదుపుచేయడం పోలీసులకు కష్టసాధ్యంగా మారింది. కొందరు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. పలువురు ఆందోళన కారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మొత్తానికి బెజవాడ అంగన్ వాడీ వర్కర్ల ఆందోళనతో అట్టుడికింది.

ఇక ప్రభుత్వం తరపున మంత్రి కె అచ్చెన్నాయుడు స్పందిస్తూ , అంగన్ వాడీ వర్కర్ల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా వుందని , జీతాల పెంపుదల వలన ప్రభుత్వంపై 12 వందల కోట్ల రూపాయల భారం పడుతుందని ఆయన అన్నారు.

English summary

Anganwadi workers concern in Vijayawada against government to solve their problems