వర్మకు ఓ లెవెల్లో కోటింగ్ ఇచ్చిన లేడీ ఎంఎల్ఎ

Angurlata Deka gave a class to Ram Gopal Varma

04:36 PM ON 24th May, 2016 By Mirchi Vilas

Angurlata Deka gave a class to Ram Gopal Varma

వివాదస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒక్క ట్వీటేస్తే చాలు.. ఇటు మీడియాకు, అటు జనానికి బోలెడంత చర్చ. వర్మ తాజా కామెంట్స్ పై కూడా ప్రస్తుతం ఇదే తరహాలో చర్చ జరుగుతోంది. అయితే, విషయంలోకి ఎంటర్ అయిన అసోం ఎమ్మెల్యే అంగూర్ లతా డేకాని వర్మ టార్గెట్ చేస్తూ.. మంగళవారం ట్విట్టర్ ద్వారా పలు వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. 'ఎమ్మెల్యేలు ఇంత అందంగా ఉన్నారంటే, మంచి రోజులు వచ్చేసినట్టే, థ్యాంక్యూ అంగూర్ లతాజీ, థ్యాంక్యూ మోడీజీ.. మీవల్ల మొదటిసారి నాకు రాజకీయాల పై ప్రేమ పుడుతోంది' అంటూ ట్విట్టర్ లో వర్మ కామెంట్స్ పోస్ట్ చేశాడు.

ఇక దీని పై స్పందించిన అంగూర్ లతా తన పై వస్తోన్న అభ్యంతరకర వ్యాఖ్యలకు గట్టిగానే సమాధానమిచ్చారు. 'సమాజంలో మార్పును ఆశించే నేను రాజకీయాల్లోకి వచ్చా, సెలబ్రిటీ అయినంత మాత్రానా తన పై దుష్ప్రచారం చేయాలనుకోవడం సరికాదు. నేను అందంగా కనిపించడమనేది దేవుడిచ్చిన వరంగానే భావిస్తా' అని పేర్కొన్నారు. కాగా.. దేశం సాంకేతికంగా ఎదిగినా మానసికంగా మాత్రం ఎదిగినట్టు కనిపించడం లేదని అంగూర్ లతా వ్యాఖ్యానించింది. సోషల్ మీడియాలో వైరల్ గా విస్తరిస్తున్న తన ఫోటోల పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ, తాను రాజకీయాల్లోకి రావడానికి మోడీయే ప్రధాన కారణమని చెప్పిన ఆమె, ఇలాంటి వివాదాలను తాను ఖాతరు చేయబోనని తేల్చేశారు.

మొత్తానికి భలే కోటింగ్ ఇచ్చిందిలే అంటూ పలువురు నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

English summary

Angurlata Deka gave a class to Ram Gopal Varma