నోట్ల ఎఫెక్ట్: ఏటీఎంల వద్ద సినిమా స్లార్ల క్యూ!

Anil Kapoor is in atm queue

12:28 PM ON 2nd December, 2016 By Mirchi Vilas

Anil Kapoor is in atm queue

నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దు చేసాక సరిపడా డబ్బుల్లేక బ్యాంకుల ముందు, ఏటీఎంల దగ్గర జనం క్యూ కడుతున్న సంగతి తెల్సిందే. అయితే, ఎవరికైనా తిప్పలు తప్పవన్నట్లు, ఏటీఎంల వద్ద సినిమా స్టార్లు కూడా క్యూ కట్టారు. పెద్ద నోట్లను రద్దు చేయడంతో పాటు అకౌంట్లలోని డిపాజిట్లను తీసుకునేందుకు షరతులు ఉండటంతో అంతా ఏటీఎంల వద్ద క్యూలు కడుతున్నారు. బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ ముంబైలోని ఓ ఏటీఎం వద్ద క్యూలైన్ లో నిల్చోవడంతో, అభిమానులు ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు. ఫోటోలు దిగిన మహిళా అభిమానులు ఫోటోలను ట్వీట్ చేశారు.

దీన్ని అనిల్ కపూర్ రీట్వీట్ చేస్తూ నోట్ల రద్దు కారణంగా తన అభిమానులను కలుసుకోగలిగానన్నారు. నోట్ల రద్దుకు ధన్యవాదాలు తెలిపారు. కొందరికి ఇబ్బంది అయినా కొందరికి ఖుషీగా వుంది.

English summary

Anil Kapoor is in atm queue