గుజరాత్ సిఎమ్ తో అనిల్ కపూర్

Anil Kapoor meets Gujarat CM Anandiben Patel

10:11 AM ON 27th February, 2016 By Mirchi Vilas

Anil Kapoor meets Gujarat CM Anandiben Patel

ఉగ్రవాదుల చెర నుంచి విమాన ప్రయాణికులను ప్రాణాలకు తెగించి  కాపాడిన హెయిర్ హోస్టెస్ కధ ఆధారంగా తీసిన నీర్జా చిత్రానికి గుజరాత్ ప్రభుత్వం పన్ను రద్దు చేసింది. ముందుగా బాలీవుడ్‌ నటుడు అనిల్‌ కపూర్‌, నీర్జా సినిమా నిర్మాత అతుల్‌ కస్బేకర్‌లు గుజరాత్‌ ముఖ్యమంత్రి ఆనంది బెన్‌ పటేల్‌ను కలిశారు. నీర్జా చిత్రానికి గుజరాత్‌లో పన్ను రద్దు చేయాల్సిందిగా ఈ సందర్భంగా వారు ముఖ్యమంత్రిని కోరారు. అందుకు ఆమె సానుకూలంగా స్పందించారు. గుజరాత్‌ ప్రభుత్వం నీర్జా చిత్రంపై పన్ను ఎత్తివేస్తున్నట్లు శుక్రవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.ఈ సందర్భంగా సినిమా గురించి అనిల్‌ కపూర్‌, అతుల్‌ కస్బేకర్‌లతో సీఎం ఆనంది బెన్‌ మాట్లాడుతూ.. మంచి నేపథ్యం ఉన్న చిత్రం అని, చక్కగా తెరకెక్కించారని కొనియాడారు. ఇంతకుముందు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా నీర్జా సినిమాకు పన్ను రద్దు చేసింది. కాగా యుపి ప్రభుత్వం కూడా పన్ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

1/5 Pages

మాట్లాడుతూ


నీర్జ సినిమా గురించి మాట్లాడుతున్న అనిల్ కపూర్, నిర్మాతలు.

English summary

Anil Kapoor Meets Gujarat Chief Minister Anandiben Patel and discussed about Sonam Kapoor's Neerja movie.After the meeting Gujarat Chief Minister Anandiben Patel announced that Gujarat Government was giving tax exemption to Neerja Movie.