అనిల్ కపూర్ కి డబుల్ ధమాకా

Anil Kapoor Son Mirzya To Release On October 7th

10:29 AM ON 15th March, 2016 By Mirchi Vilas

Anil Kapoor Son Mirzya To Release On  October 7th

బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు అనిల్‌ కపూర్‌ మరో ఆనందంలో పరవశం పొందబోతున్నాడు. ఇటీవలే ‘నీరజ’ సినిమాతో కూతురు సోనమ్‌ కపూర్‌ దేశవ్యాప్తంగా సినీ ప్రేమికుల్ని ఆకట్టుకోవడంతో పాటు విమర్శకుల ప్రశంసల్నీ దండిగా పొందింది. దీంతో పుత్రికోత్సాహంతో అనిల్ మునిగితెలుతున్నాడు. ఇక కుమారుడు హర్షవర్థన్ కపూర్‌ కూడా ఈ ఏడాదే హీరోగా ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నాడు. అతను తొలిసారి హీరోగా ‘మిర్జయా’ నటిస్తున్నాడు. ఈ చిత్రంలో హర్షవర్థన్ జోడీగా ‘అఖిల్‌’ ఫేమ్‌ సయామీ ఖేర్‌ నటిస్తోంది. ‘రంగ్‌ దే బసంతి’, ‘భాగ్‌ మిల్ఖా భాగ్‌’ సినిమాల దర్శకుడిగా అనూహ్యంగా పేరుతెచ్చుకున్న రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది అక్టోబర్‌ 7న ఈ సినిమా విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని మెహ్రా ట్విట్టర్‌ ద్వారా ప్రకటించాడు ‘మిర్జా-సాహిబా’ జానపద కథ ప్రేరణతో ఎపిక్‌ లవ్‌స్టోరీగా ‘మిర్జియా’ను మెహ్రా రూపొందిస్తున్న ఈ సినిమా కథ రాజస్థాన్ నేపథ్యంలో నడుస్తుంది. శంకర్‌-ఎహ్‌సాన్-లాయ్‌ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి గుల్జార్‌ సాహిత్యం అందిస్తున్నారు. పోలండ్‌కు చెందిన విఖ్యాత ఛాయాగ్రాహకుడు పావెల్‌ డైలస్‌ ఈ సినిమాకు పనిచేస్తుండటం విశేషం. ఇన్ని హంగులతో తీస్తున్న ఈ సినిమా తో అనిల్ కపూర్ కి పోత్రోత్సాహం కూడా రానుందా. చూద్దాం..

English summary

Veteran Hero Anil Kapoor's son Harshavardan Kapoor was acted in a movie called "Mirzya" and this movie was going to be released on October 7th.