'బాహుబలి' దర్శక-నిర్మాతల పై కేసు

Animal task force put case on Baahubali producers and director

06:48 PM ON 4th February, 2016 By Mirchi Vilas

Animal task force put case on Baahubali producers and director

దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన దృశ్యకావ్యం 'బాహుబలి'. అయితే ఇప్పుడు ఈ చిత్ర నిర్మాతలు, దర్శకుడు పై కేసు పెట్టారు. అదేంటంటే బాహుబలి రెండో పార్ట్ కి సంబంధించి కేరళ లోని త్రిసూరు లో ఇటీవలే ఒక షూటింగ్ షెడ్యూల్ జరిపారు. ఈ షూటింగ్ సమయంలో భారత వన్యమృగ బోర్డు నుండి ఎటువంటి పర్మిషన్ లేకుండా ఒక ఏనుగు ను షూటింగ్ లో ఉపయోగించారని ఆరోపించారు. ఇదే విషయాన్ని చిత్ర యూనిట్ ని అడగగా తాము ఏనుగును గ్ర్యాఫిక్స్ లో చూపించడానికి వాడుకున్నామని చెప్పారు. కానీ అది నిజం కాదని షూటింగ్ జరుగుతున్నంత సేపు 50 మంది షూటింగ్ సిబ్బంది అరుపుల వల్ల ఏనుగు చాలా ఇబ్బంది పడిందని అక్కడున్న టాస్క్ ఫోర్స్ సెక్రెటరీ వి.కె. వెంకటా చలం తెలిపారు.

వన్య ప్ర్రాణులను హింసించినందుకు ఆ చిత్ర నిర్మాతలు, దర్శకుడిని అరెస్ట్ చేసి లోపల వెయ్యాలని జంతు హక్కులని పరిరక్షించే జంతువుల టాస్క్ ఫోర్స్ బృందం డిమ్యాండ్ చేసింది.

English summary

Animal task force put case on Baahubali producers and director for harrassing Elephant in shooting.