పవన్ సినిమాకు తమిళ తంబి బాణీలు

Anirudh To Work For Pawan Next Movie

11:54 AM ON 27th January, 2016 By Mirchi Vilas

Anirudh To Work For Pawan Next Movie

పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌ ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌ లో జరుగుతుంది. ఈ సినిమాని ఏప్రిల్‌ 8 న విడుదల చెయ్యడానికి సినమా యూనిట్‌ సన్నాహలు చేస్తున్నారు. అయితే పవన్‌ సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌ తరువాత సినిమా ఎస్‌.జె. సూర్య దర్శకత్వంలో ఓ సినిమా చెయ్యనున్నాడు. సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ సినిమా పూర్తి కాగానే ఈ సినిమాను మొదలు పెట్టనున్నాడట. తాజా సమాచారం ప్రకారం కోలీవుడ్‌ యంగ్‌ అండ్‌ క్రేజీ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనిరుధ్ ను ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా తీసుకోవాలని దర్శకుడు ఎస్‌.జె సూర్య ఆసక్తి చూపిస్తున్నాడని తెలుస్తోంది. ఈ విషయం పై వీళ్ళఇద్దరి మధ్య చర్చలు కొనసాగుతున్నాయట . అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే పవర్ స్టార్ సినిమాకు అనిరుధ్ సంగీత దర్శకుడిగా పని చెయ్యడం ఖాయంగా కనిపిస్తోంది .ఈ సినిమా పై మరి కొద్ది రోజుల్లోనే అధికారికంగా ప్రకటిన వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

English summary

Power Star Pawan Kalyan was presently busy with his Upcoming and most awaited movie "Sardar Gabbar Singh". This movie to be will be released on this summer.A news came to know that pawan kalyan to work with S.J.Surya after Dardar Gabbar Singh.Kollywood's Young Music Director Anirudh to compose music to that film.