శంకరాభరణంలో అంజలి 20 నిమిషాలే!!

Anjali character in Sankarabharanam is only upto 15-20 minutes

06:50 PM ON 3rd December, 2015 By Mirchi Vilas

Anjali character in Sankarabharanam is only upto 15-20 minutes

నిఖిల్‌ హీరోగా నటించిన తాజా చిత్రం శంంకరాభరణం కొన్ని గంటల్లో విడుదలవబోతోంది. ఈ చిత్రంలో నిఖిల్‌ సరసన నందిత హీరోయిన్‌గా నటించగా అంజలి ఒక ముఖ్యపాత్రలో నటిస్తుంది. ఈ చిత్రం విడుదలవక ముందే కొన్ని ఆసక్తికర విషయాలు బయటకు వస్తున్నాయి. సినిమాని ఒక్కచేత్తో నడిపించే హీరోయిన్లు అతి తక్కువ మందే ఉంటారు అలాంటి హీరోయినే అంజలి అనడంలో అతిశయోక్తి ఏమీ లేదు. 'కబ్‌ ఆయేగా అస్లీ దివాలి' అంటూ టిపికల్‌ బాడీ లాంగ్వేజ్‌ తో అసాదారణమైన వాయిస్‌తో డైలాగ్‌ చెప్పి 'శంకరాభరణం' ట్రైలర్‌కే వన్నె తెచ్చింది.

హిందీలో నేహా ధూపియా చేసిన పాత్రే ఇందులో అంజలి చేస్తుంది. అంజలి పాత్ర నిడివి ఇందులో 15-20 నిముషాలు మాత్రమే అయినా అంజలి క్యారెక్టరే హైలెట్‌గా ఉంటుందని చెప్తున్నారు. క్యారెక్టర్‌ చిన్నదే అయినప్పటికీ కోనవెంకట్‌ మీద ఉన్న గౌరవంతోనే అంజలి ఈ క్యారెక్టర్‌ చెయ్యడానికి ఒప్పుకున్నారని తెలుస్తుంది.

English summary

Anjali character in Sankarabharanam is only upto 15-20 minutes. In this movie Nikhil is acting as hero and Nanditha is a heroine.