మిస్సమ్మ డైరెక్టర్‌తో అంజలి!!

anjali in neelakantha direction

12:10 PM ON 23rd November, 2015 By Mirchi Vilas

anjali in neelakantha direction

శివాజి, భూమిక చావ్లా హీరోహీరోయిన్లుగా డైరెక్టర్‌ నీలకంఠ తెరకెక్కించిన డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ మూవీ మిస్సమ్మ. ఈ చిత్రానికి గానూ నీలకంఠ నేషనల్‌ అవార్డు అందుకున్నారు. ఆ తరవాత సదా మీసేవలో, నందనవనం 120 కి.మీ, మిర్‌. మిర్. మేధావి, చమ్మక్‌ చల్లో వంటి చిత్రాలు తీసి భాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టించుకున్నాడు. ఇప్పుడు తాజాగా నటి అంజలితో ఒక లేడీ ఓరిమెంటడ్‌ చిత్రం రూపొందించడానికి సన్నహాలు చేస్తున్నాడు. 'షాపింగ్‌మాల్‌' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన నటి అంజలి. ఆ తరువాత 'జర్నీ' చిత్రంతో మంచి సక్సెస్‌ అందుకుని శ్రీకాంత్‌ అడ్డాల రూపొందించిన 'సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో విక్టరీ వెంకటేష్‌ వంటి అగ్రకధానాయకుడు సరసన నటించే ఛాన్స్‌ కొట్టేసింది.

ఇది కూడా హిట్‌ అవ్వడంతో అగ్రకధానాయకులతో వరుస పెట్టి నటించింది. క్రిందటి సంవత్సరం కోన వెంకట్‌ కధ అందించిన 'గీతాంజలి' చిత్రంలో లేడీ ఓరియెంటడ్‌ హీరోయిన్‌గా నటించి సూపర్‌హిట్‌ అందుకుంది. ఇప్పుడు బాలకృష్ణ తో డిక్టేటర్‌ చిత్రంలో నటిస్తుంది. 'చిత్రాంగద' అనే లేడీ ఓరియెన్‌టెడ్ సినిమాలో నటిస్తోంది. అయితే తాజాగా నీలకంఠ రూపొందించే చిత్రంలో అంజలి అయితే కరెక్ట్‌గా ఉంటుందని భావించారట. నీలకంఠ అంజలికి కధ వినిపించినా అంజలి ఇంకా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వకపోయినా నీలకంఠ డైరెక్షన్‌లో నటించడానికి ఆసక్తిగా ఉందని సమాచారం.

English summary

anjali in neelakantha direction