అంజలితో మంచు విష్ణు రొమాన్స్

Anjali is acting in Manchu Vishnu Sarada movie

12:52 PM ON 3rd December, 2015 By Mirchi Vilas

Anjali is acting in Manchu Vishnu Sarada movie

'అడ్డా' ఫేమ్‌ జి. కార్తీక్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం 'సరదా'. ఈ చిత్రంలో మంచు విష్ణు, సోనారిక బడోరియా హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం ఘాటింగ్‌ హైదరాబాద్‌లో శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమాలో సోనారికా కాకుండా మరో హీరోయిన్‌కి ఛాన్స్‌ ఉంది. ఫ్లేష్‌బ్యాక్‌లో వచ్చే హీరోయిన్‌ కోసం ఇంతకుముందు అమలాపాల్‌ని సంప్రదించారు కానీ అమలాపాల్‌ ఓకే అవ్వలేదు. ఇప్పుడు తాజాగా రాజోలు తెలుగమ్మాయి అంజలిని సంప్రదించగా కధ విని ఆమె వెంటనే ఓకే చెప్పేసింది.

లవ్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందించగా శ్రీవెంకటేశ్వర స్వామి ఫిలింస్‌ పతాకం పై డి .కుమార్‌, పల్లి కేశవరావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

English summary

Anjali is acting in Manchu Vishnu Sarada movie. She is selected as a flashback Heroine.