అతడితో లవ్ మ్యారేజ్ కి సై అంటున్న రాజోలు బ్యూటీ అంజలి

Anjali ready for marraige

04:38 PM ON 24th June, 2016 By Mirchi Vilas

Anjali ready for marraige

'ఫోటో' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన రాజోలు బ్యూటీ అంజలి మొదటి చిత్రం ఫ్లాప్ కావడంతో తమిళ చిత్ర పరిశ్రమకి షిఫ్ట్ అయింది. అక్కడ వరుస పెట్టి సినిమాలు చేసిన అంజలి 'జర్నీ' చిత్రంతో ఇటు తెలుగులో కూడా మంచి బ్రేక్ ని సంపాదించుకుంది. ఆ తరువాత విక్టరీ వెంకటేష్ సరసన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో నటించింది. అది కూడా హిట్ కావడంతో వరుస పెట్టి ఆఫర్లు వచ్చాయి. బలుపు, మసాలా, గీతాంజలి, డిక్టేటర్ వంటి చిత్రాల్లో నటించింది. అయితే ఇప్పుడు అవకాశాలు తగ్గడంతో ఐటెం సాంగ్స్ లో కూడా చేస్తుంది. తాజాగా అల్లు అర్జున్ నటించిన 'సరైనోడు' చిత్రంలో ఐటెం సాంగ్ చేసింది.

ఇదిలా ఉంటే ఈ అమ్మడు ఇప్పుడు పెళ్ళికి సై అంటోంది. కొంతకాలంగా ఆమె తన బాయ్ ఫ్రెండ్ తో ప్రేమాయణం సాగిస్తున్న విషయం తెలిసిందే. అతగాడు కోలీవుడ్ లో హీరో కూడా.. ఇద్దరూ కలిసి కొన్ని తమిళ సినిమాల్లో నటించారు.. ఈ మధ్య తన బర్త్ డే కి అంజలి ఆ బాయ్ ఫ్రెండును ఇన్వైట్ చేసింది. అంజలికి అతగాడు బర్త్ డే విషెస్ చెప్పడం, ఆమె థ్యాంక్స్ చెప్పడం జరిగిపోయాయి. ఇక తమ ప్రేమను పెళ్ళిగా మార్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఇంతకీ అంజలి మనసు దోచుకున్న ఆ హీరో ఎవరో కాదు. అతడే జై(జర్నీ).. రెండు కుటుంబాలూ ఒప్పుకుంటే ఇక ఈ ఇద్దరూ ఒక్కటైపోతారు.

English summary

Anjali ready for marraige