అంజలి కూడా ఆ లిస్ట్‌లో చేరింది

Anjali Sings Song In ChitranGada Movie

12:41 PM ON 29th February, 2016 By Mirchi Vilas

Anjali Sings Song In ChitranGada Movie

'ఫోటో' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన రాజోలు బ్యూటీ అంజలి. మొదటి చిత్రమే అట్టర్‌ ఫ్లాప్‌ కావడంతో అంజలికి సరైన గుర్తింపు రాలేదు. అయితే ఆ తరువాత తమిళ పరిశ్రమకి షిఫ్ట్‌ అయిన అంజలి తమిళంలో చాలా సినిమాల్లోనే నటించింది. కానీ ఈ ముద్దుగుమ్మకి షాపింగ్‌ మాల్‌, జర్నీతో మంచి గుర్తింపు వచ్చింది. ఈ రెండు చిత్రాలు తెలుగు, తమిళంలో కూడా విడుదలవ్వడంతో రెండు భాషల్లోనూ గుర్తింపు దక్కించుకుంది. ఆ తరువాత తెలుగులో వెంకటేష్‌ సరసన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్లు' లో నటించే అవకాశం దక్కించుకుంది. ఈ చిత్రం సూపర్‌ హిట్‌ కావడంతో అంజలికి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి.

తాజాగా బాలకృష్ణ సరసన 'డిక్టేటర్‌' సినిమాలో హీరోయిన్‌గా నటించింది. అయితే ఇప్పుడు అంజలి తాజాగా 'చిత్రాంగద' సినిమాలో నటిస్తుంది. తెలుగు, తమిళంలో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అశోక్‌.జి దర్శకత్వం వహిస్తున్నారు. కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అంజలి, సాక్షి గులాటి, సప్తగిరి ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల మన స్టార్లు సినిమాల్లో నటించడమే కాకుండా మాకు ఈ టాలెంట్‌ కూడా ఉందని నిరూపించుకోవడానికి గొంతు విప్పి పాటలు పాడేస్తున్నారు. ఆ పాటలే సినిమాల్లో హైలెట్‌ గా నిలుస్తున్నాయి. ఎన్టీఆర్‌, శింబు, సిద్ధార్ధ్‌, శృతిహాసన్‌, ఆండ్రియా, రాశీఖన్నా తదితరులు ఈ లిస్ట్‌లో ఉన్నారు. తాజాగా ఈ లిస్ట్‌లోకి అంజలి కూడా చేరింది. 'చిత్రాంగద' సినిమాలో అంజలి కూడా గొంతు విప్పి పాట పాడింది. ఈ పాట రికార్డింగ్‌ ని మొన్న శనివారం చెన్నైలోని స్టూడియోలో సెల్వ గణేషన్‌ నేతృత్వంలో ఈ పాటని పాడించారు.

'చిత్రాంగద' చిత్రం గురించి మరిన్ని విషయాలు స్లైడ్ షోలో మీకోసం.

1/6 Pages

చిత్రాంగద ట్రైలర్:

ఈ చిత్రంలో అంజలి, సాక్షి గులాటి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

English summary

Hot telugu beauty Anjali Sings a Song In Chitrangada Movie. This movie is directing by Ashok .G and music is providing by Selva Ganesh.