అంజలికి ఆ క్యారెక్టరా

Anjali to act as transgender prostitute

01:15 PM ON 6th January, 2016 By Mirchi Vilas

Anjali to act as transgender prostitute

అంజలి నందమూరి బాలకృష్ణ రాబోయే చిత్రం డిక్టేటర్‌ లో నటించింది . చాలా రోజుల తరువాత మలయాళం మెగాస్టార్‌ మమ్ముట్టి నటించే కోలీవుడ్‌ చిత్రంలో మమ్ముట్టి తో జతకట్టనుంది. ఆ చిత్రానికి 'పెరంబు' టైటిల్ ను కుడా పెట్టారు. అవార్డు విన్నింగ్‌ డైరెక్టర్‌ రామ్‌ ఈ చిత్రంతో మెగాఫోన్‌ పట్టుకోనున్నాడు .ఈ సినిమా రెగ్యూలర్‌ ఘాటింగ్‌ కొడైకెనాల్‌ లో రేపటినుండి మొదలవుతుంది. అంజలి ఈ చిత్రంలో ట్రాన్స్‌ జెండర్‌ ప్రాస్టిట్యూట్‌ పాత్రలో కనిపించబోతుంది. ఈ సినిమా మానవ సంబందాలు , భావోద్వేగాల ఆధారంగా తెరకెక్కనుంది. ఈ చిత్రానికి యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందిస్తున్నారు. అంజలి రీసెంట్‌గా తెలుగు లో ఓంకార్ దర్శకత్వంలో రూపోందుతున్న " రాజుగారి గది " సీక్వెల్‌ సినిమాకి సంతకం చేసింది.

English summary

Telugu Girl anjali grabs a chance to act with Malayalam Megastar Mammootty in the movie Peranbu.In that movie she playing role of transgender prostitute