బెజవాడ ఆటోనగర్‌లో 3.5 కోట్లతో 'అన్న' క్యాంటిన్

Anna Canteen Started In Auto Nagar In Vijayawada

12:57 PM ON 1st June, 2016 By Mirchi Vilas

Anna Canteen Started In Auto Nagar In Vijayawada

ఆకలి కడుపులు నింపడమే ఆశయంగా తమిళనాడులోని పేద ప్రజలకు, కార్మికులకు తక్కువ ఖరీదుకు రుచికరమైన, పౌష్టికాహారాన్ని ముఖ్యమంత్రి జయలలిత అమ్మ క్యాంటిన్ల ద్వారా అందిస్తుంటే, దాన్ని స్ఫూర్తి గా తీసుకుని, టిడిపి ఎన్నికల్లో అన్న క్యాంటీన్లు పెడతామని హామీ ఇచ్చింది. అయితే వీటిని ప్రారంభించడంలో కొంత జాప్యం జరిగింది. ఇంతలోనే తమిళనాడు ఎన్నికలు కూడా జరిగాయి. పేద ప్రజల ఆకలిని తీర్చటంలో అమ్మ క్యాంటిన్లు విజయవంతం కావడమే కాదు, జయ రెండోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని ఆధిరోహించడంలో అమ్మ క్యాంటిన్లు ఎంతో కీలక పాత్ర పోషించాయని రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతున్నారు.

అందుకే ఆటోనగర్‌లోని కార్మికులకు సబ్సిడీతో భోజనాన్ని తక్కువ ఖరీదుకే అందించాలని విజయవాడ ఎంపీ కేశినేని నాని సంకల్పించారు. తక్కువ ఖర్చుతో పౌష్టికాహారాన్ని అందించాలనే ఉద్దేశ్యంతో విజయవాడలోని ఆటోనగర్‌లోని కార్మికుల కోసం 'అన్న క్యాంటిన్' ను ఏర్పాటు చేస్తున్నారు. ఆటోనగర్‌లోని ఎన్టీఆర్ స్మృత్యర్థం అన్న క్యాంటిన్‌ను ఏర్పాటు చేయాలని సంకల్పించారు. ఈ క్యాంటీన్ ఏర్పాటు కోసం 3.5 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. అన్న క్యాంటీన్ కోసం ఆటోనగర్‌లోని ఓ ప్రైవేట్ వ్యక్తికి చెందిన భూమిని ఆరు సంవత్సరాలకు లీజుకు తీసుకున్నారు. నగర కమిషనర్ ఆటోనగర్‌కు సమీపంలో ప్రభుత్వ భూమని ఇచ్చినట్లైతే అక్కడే శాశ్వతంగా పక్కా భవనంలో క్యాంటిన్ ఉండేలా ఏర్పాటు చేయాలని ఎంపీ నాని భావిస్తున్నారు.

ఆటోనగర్‌లో దాదాపు లక్షా 25వేల మంది కార్మికులున్నారు. వారందరికి ఈ క్యాంటీన్ ఎంతగానో ఉపయోగపడనుంది. తాత్కాలిక క్యాంటీన్ నిర్మాణం కోసం ఎంపీ నాని కేశినేని ట్రస్ట్ తరుపున రూ. 10 లక్షలు విరాళంగా ప్రకటించారు. ప్రతిరోజూ రెండు వేల మందికి సబ్సిడీతో పౌష్టికాహారాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ క్యాంటీన్ నిర్వహణ బాధ్యతలను ఇస్కాన్ బెంగుళూరుకు చెందిన అక్షయ పాత్రకు అప్పగించారు. ఆగస్టు మొదటి వారంలో ఏపీ సీఎం చంద్రబాబు చేతుల మీదగా ఈ అన్న క్యాంటిన్‌ను ప్రారంభించాలని విజయవాడ ఎంపీ కేశినేని నాని సన్నాహాలు చేస్తున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీ న్లు వచ్చే అవకాశం వుందని అంటున్నారు.

ఇవి కూడా చదవండి: జగన్ గురించి జ్యోతుల పురాణం

ఇవి కూడా చదవండి:బాహుబలి, అరుంధతిలను మించిపోయిన టీజర్(వీడియో)

English summary

Telugu Desham Party had put in their manifesto in 2014 elections that they were going to establish Anna Canteens all over Andhra Pradesh now first Anna Canteen was started in Auto Nagar Area in Vijayawada by Kesineni Nani. Within few Days these canteens were going to start in all Over Andhra Pradesh.