'అర' ఎకరం కోల్పోయిన 'అన్నపూర్ణ స్టూడియోస్‌'!

Annapurna Studios lost half acre due to Metro Rail Project

01:41 PM ON 7th December, 2015 By Mirchi Vilas

Annapurna Studios lost half acre due to Metro Rail Project

హైదరాబాద్‌ లో గత మూడు సంవత్సరాలుగా జరుగుతున్న 'మెట్రో రైల్‌ ప్రోజెక్ట్‌' పనులు చివరి దశకు చేరుకున్నా ఇంకా అది ప్రారంభం కాలేదు. తాజాగా ఈ మెట్రో ప్రోజెక్ట్‌ 'అన్నపూర్ణ స్టూడియోస్‌' ని కూడా టార్గెట్‌ చేసింది. అక్కినేని నాగార్జున అధినేత అయిన ఈ స్టూడియోలో మొత్తం 7 ఎకరాలు విస్తీరణ ఉంది. ఇదిలా ఉండగా ఇందులో అర ఎకరం మెట్రో ప్రోజెక్ట్‌ కోసం తీసుకోబోతున్నారు. ఇటీవలే ఖైరతాబాద్‌ ఎంఎల్‌ఏ చింతల రామచంద్రా రెడ్డి నాగార్జునని కలిసి ఆ అర ఎకరం కోసం చర్చించారు. అయితే నాగార్జున ముందు అభ్యంతరం తెలుపగా ఆ తరువాత చాలా మంది రాజకీయ వేత్తలు నాగార్జునని ఒప్పించే ప్రయత్నం చేశారు.

అయితే నాగార్జున మాత్రం తెలంగాణ ముఖ్యమంత్రి అయిన కె. చంద్రశేఖర్‌ రావుని కలిసి ఆ అర ఎకరానికి నష్టపరిహారం అందించవల్సిందిగా ముఖ్యమంత్రిని కోరనున్నారు.

English summary

Annapurna Studios lost half acre due to Metro Rail Project in Hyderabad. Akkineni Nagarjuna want to meet Telangana chief minister K. Chandra Sekhar Rao for compensation for half acre.