ఐఎస్ఐ ఏజెంట్ అరెస్ట్

Another Pakistan ISI Agent Arrested In India

11:42 AM ON 4th December, 2015 By Mirchi Vilas

Another Pakistan ISI Agent Arrested In India

ఇటీవల పాకిస్తాన్ ఐఎస్‌ఐ సంస్ధ తో సంభందం ఉన్న ఐదుగురిని భారత్‌ లో అరెస్ట్‌ చేసిన ఘటన మరువక ముందే మరో పాకిస్తాన్‌ ఐఎస్‌ఐ ఎజెంట్‌ను కలకత్తా స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు.

షేక్‌ బాదల్‌ అనే 59 ఏళ్ళ వ్యక్తిని కలకత్తాలో స్పెషల్‌ టాస్క్ ఫోర్స్‌(SPF) పోలీసులు అదువులోని తీసుకున్నారు.

పోలీసులు షేక్‌ బాదల్‌ గురించి మీడియాకు వివరాలు తెలియజేసిన పోలీసులు, ఇతను ప్రస్తుతం పాస్‌పోర్టు ఎజెంట్‌గా పనిచేస్తున్నాడని, మహమ్మద్‌ ఇజాజ్‌ అనే పాకిస్తాన్‌ ఐఎస్‌ఐ కు చెందిన వ్యక్తిని నకిలీ గుర్తింపు కార్టుతో ఉత్తరప్రదేశ్‌ నుండి అక్రమంగా దేశం దాటించాడని తెలిపారు. గతంలో పోలీసులకు పట్టుబడిన పాకిస్తాన్‌ ఐఎస్‌ఐ ఎజెంట్‌ జహంఘీర్‌ను విచారణ జరుపుతుండగా బాదల్‌ పేరును వెల్లడించాడని తెలిపారు.

జహంఘీర్‌ బాదల్‌ లు ఇద్దరు గత కొన్ని సంవత్సరాలుగా స్నేహితులని, బాదల్‌ మొదట్లో టైలరింగ్‌ వృత్తి చేసేవాడని, తరువాత పాస్‌పోర్టు ఏజెంట్‌గా మారాడని తెలిపారు.

బాదల్‌ ను ప్రశ్నించిన అధికారులకు బాదల్‌ గురించి ఆసక్తికరమైన విషయాలు తెలిసాయి. భారత్‌లో పుట్టిన బాదల్‌ బంగ్లాదేశ్‌ కు వలస వెళ్ళి అక్కడ పెళ్ళి చెసుకున్నాడని, బాదల్‌ కు ఒక కొడుకు ఉండేవాడని, ఆ కొడుకు 15 ఏళ్ళ వయసులో రాజకీయ గొడవల్లో చనిపోయాడని తెలిసింది. తరువాత మళ్ళీ భారత్‌ తిరిగివచ్చి స్ధానికంగా ఒక మహిళను పెళ్ళాడాడు. పోలీసులు బాదల్‌ను బ్రాబౌర్న్‌ రోడ్డులోని రీజనల్‌ పాస్‌పోర్ట్‌ ఆఫీసులో పట్టుకుని అతడి పై భారత శిక్షస్మృతి చట్టాల్లోని 121, 121ఎ, 489బి, 489సి వంటి కేసులను పెట్టినట్లు పోలీసులు తెలిపారు.

English summary

The Special Task Force (STF) of the Kolkata Police has arrested a passport agent who has links with Pakistan's Inter-Services Intelligence (ISI)