మరో ఫోటో పెట్టిన జుకర్‌బర్గ్‌

Another Photo From Zucker Berg

03:18 PM ON 9th December, 2015 By Mirchi Vilas

Another Photo From Zucker Berg

ఫేస్బుక్‌ వ్యవస్థాపకుడైన మార్క్‌ జుకర్‌బర్గ్‌ ఇటీవలే తండ్రి అయిన విషయం అందరికి తెలిసిందే. తన కూతురు మాక్స్‌ పుట్టిన ఆనందంతో తన ఆస్తిలోని 99% షేర్లను దానం చేస్తానని ప్రకటించాడు. తమ కూతురు తో పాటు ఫోటొ దిగిన జుకర్‌బర్గ్‌ ఆయన భార్య ప్రిస్కిల్లా చాన్‌లు ఆ ఫోటోను ఫేస్బుక్లో పెట్టి తమ కూతురిని ప్రపంచానికి పరిచయం చేసారు.

తాజాగా జుకర్‌బర్గ్‌ తన కూతురు మాక్స్‌తో నేలమీద పడుకుని ఉత్సాహంగా ఆడుకుంటున్నట్లుగా ఉన్న ఫోటోను "Full of joy with little Max"అని తన ఫేస్బుక్‌ ఖాతాలో పెట్టాడు. ఈ ఫోటోకు ఇప్పటి వరకు 2,622,236 లైక్‌లు, ప్రపంచవ్యాప్తంగా తన కూతిరి మంచిని కోరుకుంటూ అనేక మంది కామెంట్లు చేశారు.

English summary

Facebook CEO Zuckerberg uploaded a photo of his child max when he was playing with her.He posted that photo in facebook