వర్మకు మరో అడ్డంకి

Another Problem To RamGopal Varma Movie

09:51 AM ON 12th February, 2016 By Mirchi Vilas

Another Problem To RamGopal Varma Movie

వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ , సంచలన దర్శకుడు గా చెలామణి అవుతున్న రామ్ గోపాల్ వర్మ కు ఇప్పుడు మరో అవాంతరం వచ్చిందట. వంగవీటిపై సినిమా తీస్తానన్న నాటి నుంచి అడుగడుగునా అడ్డంకులు వస్తున్న నేపధ్యంలో తాజాగా వర్మ స్క్రిప్ట్‌ను పరిశీలించాలని గాంధీగ్లోబల్ ఫ్యామిలీ సర్వోదయ మండలి కోరుతోంది. ఈ మేరకు చంద్రబాబుకు,, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా), సెన్సార్‌బోర్డు లకు వినతిపత్రాలు అందించింది. విజయవాడలో అన్నదమ్ములుగా ఉంటున్న రెండు వర్గాల మధ్య చిచ్చుపెట్టొద్దు, వివాదాల జోలికి వెళ్లకుండా సినిమా తీసుకోవాలంటూ సర్వోదయ మండలి వినతి పత్రంలో కోరింది. అసలు ఈ సినిమా ఎనౌన్స్ చేసిన నాటినుంచి ఇబ్బందులు వస్తున్నాయనే చెప్పాలి. అభిమానుల తరపున డైరెక్టర్ వర్మకు వంగవీటి రాధాకృష్ణ ఓ హెచ్చరిక జారీచేయడం, దీనిపై వర్మ ఘాటుగా స్పందించడం తెల్సిందే. ఇక ఇప్పుడు ఫిర్యాదుల వరకు వెళ్ళింది. ఇంతకీ ఈ చిత్రం తెరకు ఎక్కుతుందా? అసలు ఈ సినిమాను ఎకోణం లో చూపించబోతున్నట్టు.? వంటి విషయాలకు ఇంకా క్లారిటీ లేదు. అయితే ఈ చిత్రంతో ఇక తాను టాలీవుడ్ సినిమాలకు స్వస్తి పలకనున్నట్లు వర్మ ఇప్పటికే ప్రకటించాడు. మరోవైపు ఈ చిత్రానికి సంబంధించి వర్మ విడుదల చేసిన పాట కూడా పలు వివాదాలకు దారితీస్తోంది.

English summary

Ram Gopal Varma has declared that he will defenately make film on Vangaveeti Mohana Ranga.Recently Gandhi Global Family Sarvodhaya Mandali gives letter to Movie Artist Association(Maa) and Sensor Board on this movie script.