టెన్షన్... టెన్షన్... 'జనతా గ్యారేజ్ కి' మరో సెంటిమెంట్...

Another sentiment for Janatha Garage release

12:34 PM ON 27th August, 2016 By Mirchi Vilas

Another sentiment for Janatha Garage release

ఈరోజుల్లో ఓ సినిమా తీయాలంటే, దానివెనుక వరుసగా ఎన్నో కష్టాలు వెంటాడుతుంటాయి. ప్రారంభ షాట్ మొదలు విడుదల వరకూ అన్నీ సెంటిమెంట్ల ప్రకారమే జరుగుతాయి. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ తాజా సినిమా 'జనతా గ్యారేజ్' విషయంలో కూడా ఉన్నట్లుండి ఒక కొత్త సెంటిమెంట్ వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై ఎన్టీఆర్ అభిమానులకు కొత్త టెన్షన్ పుట్టుకొచ్చిందట. ఎన్టీఆర్ అభిమానులకు వచ్చిన ఈ కొత్త టెన్షన్ పేరు చెబితే భలే గమ్మత్తుగా ఉంటుంది. అదే ఈరోస్. ఎందుకంటే జనతా గ్యారేజ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతుంది ఈ సంస్థే. ఈ సినిమాను సెప్టెంబరు 1న ప్రపంచవ్యాప్తంగా సుమారు 2 వేల థియేటర్లలో తెలుగు - తమిళ - మలయాళం బాషల్లో భారీగా విడుదల చేయబోతున్నారు.

ఇదే సమయంలో ఒకరోజు ముందే అమెరికాలో ప్రీమియర్లు కూడా భారీగానే ప్లాన్ చేశారు. ఇక జనతా గ్యారేజ్ సెన్సార్ కార్యక్రమాలు శుక్రవారమే పూర్తయ్యాయి. కట్స్ ఏమీ లేకుండానే ఈ సినిమాకు 'యూ/ఎ' సర్టిఫికేట్ వచ్చింది. అయితే ఈ విషయాలన్నీ అభిమానులకు ఉత్సాహాన్ని తెప్పిస్తుంటే.. ఈరోస్ సెంటిమెంట్ ఒక్కటే ఆందోళన కలిగిస్తుందట. అన్నీ బాగున్నాయి కదా ఇక అందులో టెన్షన్ ఏముందని అనుకుంటారు. అక్కడే వుంది అసలు చిక్కు. ఎందుకంటే, తెలుగులో ఈరోస్ సంస్థకున్న గత రికార్డులు పరిశీలిస్తే, టెన్షన్ ఎందుకో బోధ పడుతుంది. మహేష్ బాబు '1 - నేనొక్కడినే' దగ్గర్నుంచి మొదలుపెడితే మొన్న వచ్చిన పవర్ స్టార్ 'సర్ధార్ గబ్బర్ సింగ్' వరకూ వాళ్లు విడుదల చేసిన సినిమాలు అన్నీ డిజాస్టర్ అయ్యాయి.

ఈ దారుణమైన ఫలితాలనే చూసాక, కంగారు రాక ఏమవుతుంది. అందుకే జనతా గ్యారేజ్ కి సెన్సార్ పూర్తయిన వెంటనే విడుదలయిన పోస్టర్ లో వరల్డ్ వైడ్ రిలీజ్.. ఈరోస్ సంస్థ అని ప్రకటన రావడంతో ఈ కొత్త గుబులు పట్టుకుందట.

ఇది కూడా చదవండి: అయ్యో సన్నీ లియోన్ కి ఏమైంది(వీడియో)

ఇది కూడా చదవండి: కూతుళ్ళతో స్టార్ హీరో డాన్స్

ఇది కూడా చదవండి: ఈ సభతో పవన్ చెప్పేదేమిటి.. సంచలన నిర్ణయంపై ఉత్కంఠ

English summary

Another sentiment for Janatha Garage release. Eros International is releasing Janatha Garage movie world widely.