'బాహుబలి-2' లో మరో స్టార్‌ హీరోయిన్‌ 

Another star heroine in Baahubali 2

04:02 PM ON 14th March, 2016 By Mirchi Vilas

Another star heroine in Baahubali 2

'ఎస్‌.ఎస్‌. రాజమౌళి తెరకెక్కించిన వెండితెర దృశ్యకావ్యం 'బాహుబలి'. ప్రభాస్‌, రమ్యకృష్ణ, నాజర్‌, సత్యరాజ్‌, అనుష్క, రానా, తమన్నా వంటి స్టార్‌ నటులున్న ఈ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా 'బాహుబలి-2' తెరకెక్కుతుంది. ప్రస్తుతం షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం ఇప్పటికే స్టార్‌ నటులతో నిండిపోతే, ఇందులో మరోస్టార్‌ హీరోయిన్‌ వచ్చి చేరింది. ప్రభాస్‌తో ఛత్రపతి, మున్నా వంటి చిత్రాల్లో నటించిన హాట్‌ బ్యూటీ శ్రియ శరణ్‌ ఇందులో రానా సరసన హీరోయిన్‌గా నటించనుంది. ఇటీవలే రానా-శ్రియలకి ఫోటోషూట్‌ నిర్వహించిన రాజమౌళి వీరి జోడి సరిగ్గా సరిపోవడంతో వెంటనే శ్రియని ఫిక్స్‌ చేసేశాడట.

ఇప్పటికే సరైన అవకాశాలు లేక అవార్డు వేడుకల్లో తన డ్యాన్సులతో కాలాన్ని నెట్టుకొస్తున్న శ్రియకి నిజంగా ఇది మంచి అవకాశమనే చెప్పాలి. ఇంతటి ప్రఖ్యాత చిత్రంలో శ్రియ అవకాశం దక్కించుకున్నందుకు చాలా ఆనందంగా ఉందంటూ ఎగిరి గంతేసింది. ఈ చిత్రం షూటింగ్‌లో త్వరలోనే జాయిన్‌ కానుంది. ప్రస్తుతం అనుష్క గర్భవతైన సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం 2017 ఏప్రిల్‌లో విడుదల కానుంది.

రానా-శ్రియ మధ్య ఉన్న ఎఫైర్ గురించి మరికొన్ని విషయాలు స్లైడ్ షోలో చూడండి.

1/11 Pages

ఇదివరకు రానాతో త్రిష, రకుల్ ప్రీత్ సింగ్ లాంటి వారితో ఎఫైర్లు ఉందని వార్తలు రాగా, తాజాగా శ్రియ కూడా వచ్చి చేరింది.

English summary

Another star heroine in Baahubali 2. Hot beauty Shriya Saran is acting as heroine with Rana Daggubati in Baahubali The Conclusion.