మరో అనుమానితుని అరెస్ట్ 

Another Suspicious man Arrested

12:38 PM ON 23rd January, 2016 By Mirchi Vilas

Another Suspicious man Arrested

భారత గణతంత్ర వేడుకల నేపధ్యంలో దేశంలో అలజడులు సృష్టించాలని ఉగ్రవాదులు పన్నాగం పన్నుతున్నారన్న సమాచారంతో దేశవ్యాప్తంగా నేషనల్ ఇన్వెష్టిగేషన్ ఏజన్సీ (ఎన్ఐఎ) అధికారులు విస్తృతంగా తనిఖీలు సాగిస్తున్న సంగతి తెల్సిందే. ఈక్రమంలో ముంబయిలో అనుమానిత వ్యక్తిని ఎన్‌ఐఏ అధికారులు అరెస్టు చేశారు. పట్టుబడిన వ్యక్తి భారత్‌లోకి అక్రమంగా చొరబడిన ఉగ్రవాదిగా అనుమానిస్తున్నారు. గణతంత్ర వేడుకలను భగ్నం చేసేందుకు ఉగ్రవాదులు దాడులకు తెగబడే అవకాశముందన్న నిఘా సంస్థల హెచ్చరికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో తనిఖీలు మరింత ముమ్మరం చేశారు. ఐఎస్‌ఎస్‌తో సంబంధాలున్నాయన్న అనుమానంతో నిన్న నాలుగు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించిన ఎన్‌ఐఏ అధికారులు 14మందిని అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.

English summary

National Investigation Agency (NIA) arrests another person Thinking that he was terrorist because of there is an Threat on the occasion of Republic Day. Upto Now NIA officials arrested 14 members and investigating them