టి ఆర్ఎస్ గూటికి మరో టిడిపి ఎంఎల్ఎ 

Another TDP MLA To Joined In TRS Party

12:17 PM ON 3rd December, 2015 By Mirchi Vilas

Another TDP MLA To Joined In TRS Party

తెలంగాణాలో టిడిపి మరో వికెట్ కోల్పోయింది. ఆ పార్టీకి చెందిన ఎంఎల్ఎ సాయన్న టిఆర్ఎస్ గూటికి చేరుకున్నారు . ఇప్పటికే పలువురు టిడిపి ఎంఎల్ఎలు టిఆర్ఎస్ తీర్హ్డం పుచ్చుకోవడం , దీనిపై స్పీకర్ కి టిడిపి పిర్యాదు చేయడం తెల్సిందే . తాజాగా సాయన్న కూడా టిడిపి బంధాన్ని వదిలి సిఎమ్ కెసిఆర్ సమక్షంలో టిఆర్ఎస్ లో చేరిపోయారు. అలాగే కాంగ్రెస్ కి చెందిన ఎంఎల్సి ప్రభాకర్ కూడా టిఆర్ఎస్ లో చేరిపోయారు. వరంగల్ ఉప ఎన్నిక లో గెలిచిన జోష్ తో వున్న టిఆర్ఎస్ త్వరలో జరగబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కూడా విజయకేతనం ఎగుర వేయడానికి పావులు కదుపుతోంది. సాయన్న , ప్రభాకర్ చేరికతో సరిపెట్టకుండా మరికొంతమంది కూడా ఆ దారిలోనే వేల్లబోతున్నట్లు వినికిడి .

కాగా మాజీ మంత్రి జె గీతారెడ్డి కాంగ్రెస్ ని వీడి టి ఆర్ ఎస్ లో చేరుతున్నట్లు వార్తలు రావడంతో గీతారెడ్డి తీవ్రంగా ఖండించారు. టి ఆర్ ఎస్ మైండ్ గేం లో భాగంగానే ఇలాంటి గాలి వార్తలు వస్తున్నాయని గీతారెడ్డి అంటున్నారు. అలాగే మరో మాజీ మంత్రి దానం నాగేందర్ కూడా టి ఆర్ ఎస్ లో చేరుతున్నట్లు వార్తలు షికారు చేసాయి.. దానం కూడా తీవ్రంగా ఖండిస్తూ , సిఎమ్ కెసిఆర్ ని కలసిన మాట వాస్తవమేనని అయితే టి ఆర్ ఎస్ లో చేరే ఉద్దేశ్యం లేదని చెప్పేసారు. జి హెచ్ ఎం సి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం వ్యూహం రచిస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. మొత్తానికి జి హెచ్ ఎం సి ఎన్నికల ముందు , తర్వాత కూడా తెలంగాణాలోని విపక్క్షాల్లో ఎవరు మిగులుతారో , ఎవరు టి ఆర్ ఎస్ గూటికి చేరతారో చెప్పడం కష్టమే .

English summary

Another TDP MLA Sayanna to joined in TRS party.Congress party MLC Prabhakar also joined Iin TRS today