వైమానిక స్థావరంలో మరో ఉగ్రవాది హతం 

Another Terrorist Killed In Pathankot

05:26 PM ON 4th January, 2016 By Mirchi Vilas

Another Terrorist Killed In Pathankot

పఠాన్‌కోట్‌ ఉగ్రదాడి ఘటనలో గాలింపు చర్యలు కొనసాగిస్తున్న నేపధ్యంలో సోమవారం మరో ఉగ్రవాదిని హతమార్చారు. ఆసియాలోనే అతి పెద్దదైన ఈ వైమానిక స్థావరంపై పూర్తి నిఘా ఉంచారు. గత శనివారం వైమానిక స్థావరంలోకి ఉగ్రవాదులు చొచ్చుకు రావడంతో కాల్పులు జరిపారు. నలుగురు ఉగ్రవాదులను హతమార్చారు. ఈ ఘటనలో ఇద్దరు సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం మరో ఉగ్రవాదిని కాల్చి చంపగా , ఈరోజు ఇంకో ఉగ్రవాదిని హతమార్చారు. ఇంకా ఉగ్రవాదులు వున్నారనే అనుమానంతో కొనసాగిస్తున్న గాలింపు చర్యలు సత్ఫలితాలు ఇచ్చింది.

కాగా ఈనెల 15న పాకిస్తాన్ తో జరగాల్సిన చర్చలపై భారత్ తర్జన భర్జన పడుతోంది. పఠాన్‌కోట్‌ ఘటన నేపధ్యంలో ఇస్లామా బాద్ లో విదేశాంగ కార్యదర్శుల చర్చలు జరపరాదని సూచన ప్రాయంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.

English summary

Due to sudden terrorist attack in Pathankot. Army has alerted in Aisa's biggest Air Force Station Hindon Air Force Station.Upto now Army has been killed 6 terrorists. In this incident 2 Army members were also lost their lives.Today army killed another terrorist in Pathankot