హెచ్ సియూలో మరో ట్విస్ట్ 

Another Twist In HCU Incident

12:55 PM ON 25th January, 2016 By Mirchi Vilas

Another Twist In HCU Incident

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వేముల రోహిత్ ఆత్మహత్య ఘటన కేసులో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. రోహిత్ ఆత్మహత్య ఘటన అటు సోషల్ మీడియాలో , ఇటు మీడియాలో ప్రధాన చర్చ అయింది. ప్రధాన పార్టీల నేతలు , జాతీయ పార్టీల నేతలు పరామర్శ కు క్యూ కడుతున్నారు. రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. ఇక పలుచోట్ల నిరసన ప్రదర్శనలు , అనుకూల - వ్యతిరేక వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇక వర్సిటీ వైస్ ఛాన్సులర్ అప్పారావు సెలవుల పై వెళ్లారు. ఆయన స్థానంలో డాక్టర్ విపిన్ శ్రీవాత్సవ బాధ్యతలు తీసుకున్నారు. విసిని సస్పెండ్ చేసి తీరాలని ఆందోళన చేస్తున్న విద్యార్ధి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తమ డిమాండ్లు నెరవేరేదాకా ఉద్యమిస్తామని స్పష్టం చేస్తున్నాయి.

English summary

Another twist in Hyderabad Central University (HCU) Student Rohit Sucide Case. HCU's Vice Chancellor Appa Rao Takes Leave and another professor Sri Vatsava takes cahrge instead of him