తెలంగాణా టిడిపి కి మరో షాక్ 

Anothter Shock To TTDP

10:01 AM ON 12th February, 2016 By Mirchi Vilas

Anothter Shock To TTDP

గులాబి దళంలోకి తాజాగా రాజేందర్ రెడ్డి

పార్టీ వదిలిన 10మంది - ఇక ఫిరాయింపు వర్తించదట.

నేడో రేపో స్పీకర్ కి లేఖ ఇచ్చే యోచన

వరుస వలసలతో తెలంగాణ తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. మొన్నటికి మొన్న పార్టీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర రావు టిఆర్ఎస్ గూటికి చేరగా,మహబూబ్‌నగర్‌ జిల్లా నారాయణ్‌పేట నియోజకవర్గం నుంచి టిడిపి తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందిన రాజేందర్‌రెడ్డి ఆదే బాట పట్టారు. గురువారం రాత్రి తాజ్‌కృష్ణాలో మంత్రులు హరీశ్‌రావు, కెటిఆర్ , లక్ష్మారెడ్డి లతో భేటీ అయిన అనంతరం టిఆర్ఎస్ లో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే తెరాసలో చేరుతున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత గత 20 నెలల్లో తన నియోజకవర్గంలో చిన్న పనికూడా చేయలేకపోయానన్నారు. సీఎం కేసీఆర్‌ దిల్లీ నుంచి వచ్చిన తర్వాత సమావేశమై నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించి టిఆర్ఎస్ లో అధికారికంగా చేరుతానన్నారు. టిడిపి తో తనకు ఎలాంటి విభేదాలు లేవని, కార్యకర్తల అభీష్టం మేరకే పార్టీ మారుతున్నాని ఆయన చెప్పారు.

తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్‌ నేత ఎర్రబెల్లి దయాకరరావు, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌లు పార్టీని వీడిన మరుసటి రోజే ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి టిఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రకటించి, మరికొంతమంది కూడా కారు ఎక్కబోతున్నట్లు చెప్పారు. ఆ మాటలను అక్షర సత్య చేస్తూ, గురువారం హైదరాబాద్‌లో ఎన్టీఆర్‌ ట్రస్టుభవన్‌లో తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు నేతృత్వంలో జరిగిన తెలంగాణ తెదేపా విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న రాజేందర్‌రెడ్డి ఆ తర్వాత రెండు గంటల్లోనే టిడిపి కి జెల్ల కొట్టడం ఆ పార్టీ నేతలను విస్మయానికి గురిచేసింది.

కాగా తెలంగాణ శాసనసభలో టిడిపి సభ్యుల సంఖ్య 15 మంది. వీరిలో పది మంది అంటే మూడింట రెండొంతుల మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడినట్లవుతుంది. ఫలితంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఫిరాయింపుల నిరోధకచట్టం వర్తించదు. ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకరరావు, ప్రకాశ్‌గౌడ్‌ల చేరికతో తెదేపాను వీడిన ఎమ్మెల్యేల సంఖ్య తొమ్మిది కాగా గురువారం తెరాసలో చేరుతున్నట్లు ప్రకటించిన రాజేందర్‌రెడ్డితో కలిపి వీరి సంఖ్య పదికి చేరింది.

శాసనసభ సభాపతికి లేఖ:

తెలుగుదేశం పార్టీకి చెందిన పది మంది ఎమ్మెల్యేలు తమను తెరాస పార్టీ సభ్యులుగా గుర్తించాలని కోరుతూ శాసనసభ సభాపతికి శుక్రవారం లేఖ అందజేయబోతున్నట్లు చెబుతున్నారు. ఇలా అయితే మరికొద్ది రోజుల్లో టిడిపి తెలంగాణాలో ఖాళీ అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. మరోపక్క ఎపిలో అధికార టిడిపి వైపు పలువురు అడుగులు వేస్తున్నారు. అల్టిమేట్ అధికారమే ముఖ్యం కదా .....

English summary

Recently Soo many TDP MLA's were joining in TRS party and two days ago Telangana Telugu Desam Party Senior leader Errabelli Dayakara Rao was also joined in TRS and now Narayanpet MLA Rajendar Reddy was also ready to join in TRS.