మరోసారి అందాలు ఆరబోసిన రష్మీ(వీడియో)

Antham movie trailer

01:05 PM ON 10th June, 2016 By Mirchi Vilas

Antham movie trailer

గుంటూరు టాకీస్ చిత్రంలో రష్మీ చేసిన అందాల విందు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులో రష్మీ ఇచ్చిన అందాల ఆరబోతకి కురాళ్ళ నుండి ముసలి వాళ్ళ వరకు ఫిదా అయిపోయారు. ఈ సినిమా జయాపజయాలు ఎలా ఉన్నా ఇందులో రష్మీ ఆరబోతకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. దీంతోనే ఈ అమ్మడుకి అవకాశాలు మీద అవకాశాలు వచ్చి పడుతున్నాయి. రష్మీ తాజాగా నటిచిన చిత్రం అంతం. జిఎస్ఎస్పి కళ్యాణ్ దర్శకత్వంలో తెరకెక్కిన అంతం అనే చిత్రంలో రష్మీ లీడ్ రోల్ పోషించింది. చరణ్దీప్ రష్మీ సరసన నటించాడు. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలను జరుపుకుంటుంది.

అయితే ఈ చిత్రానికి సంబంధించి తాజాగా ఓ ట్రైలర్ను విడుదల చేసారు. లవ్, రొమాన్స్, హర్రర్ కలగలిపి ఈ సినిమాను దర్శకుడు తెరకెక్కించినట్టు తెలుస్తోంది. త్వరలో విడుదల కానున్న అంతం చిత్రానికి కార్తీక్ రాడ్రిగ్జ్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. సినిమా ఎలా ఉంటుందో కానీ ట్రైలర్ మాత్రం అదరకొట్టారనే చెప్పాలి. ఈ ట్రైలర్ లో తొలి సగం రొమాన్స్.. రెండో సగం థ్రిల్ ఉండేలా ప్లాన్ చేసి అదరకొట్టారు. ముఖ్యంగా ఈ ట్రైలర్ లో రష్మీ తన భర్తతో తమ కొత్త ఫ్లాట్ లో రొమాన్స్ చేస్తూ లైఫ్ లీడ్ చేస్తుంది. అయితే ఒక రోజు రష్మీ ఒక్కత్తే ఇంట్లో ఉండగా తన భర్త నుంచి కాల్ వస్తుంది.

భర్త కారు నడుపుకుంటూ వస్తూ.. ఇంట్లో ఎవరైనా ఉన్నారేమో చూడు అంటూ భయపడుతూ అడుగుతాడు. అయితే ఆమె మాత్రం భర్త తనతో జోక్ చేస్తున్నాడనుకుంటుంది. కాసేపటి తర్వాత ఆమెకు తాను ప్రమాదంలో ఉన్నానని అర్థం అవుతుంది. ఇక భర్త వచ్చేలోపు తనకొచ్చిన ఆపద నుంచి ఆమె ఎలా బయటపడిందిన్నది మిగతా కథ అని మనకి ఈ ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది. ట్రైలర్ ఎలా ఉంది, సినిమా ఎలా ఉండబోతోంది... థ్రిల్ ఉందా లేదా అనే సంగతి పక్కనబెడితే.. ట్రైలర్ లో ప్రధానంగా రష్మీ అందాలే హైలైట్ అయ్యాయి. చివర్లో 'ఇంటికి రా.. స్వర్గం చూపిస్తా' అనే డైలాగ్ హైలైట్ గా నిలిచింది. జూన్ చివరి వారంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

English summary

Antham movie trailer