యాంటీ ఏజింగ్‌ ఫుడ్స్‌

Anti-aging foods

06:48 PM ON 11th December, 2015 By Mirchi Vilas

Anti-aging foods

60 లో కూడా 20 లా ఉండాలని ఎవరికి ఉండదు చెప్పండి. మీకు మాత్రం అలా ఉండాలని లేదా? ప్రతి ఒక్కరికి తమ వయస్సు కంటే చిన్నవారిలా కనపడాలనే ఉంటుంది. కాని అది సాధ్యమా? కొన్ని ఆహారపదార్ధాలను తినడం వల్ల వయస్సు పై బడినట్లు కనపడదు. అలాంటి పదార్ధాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కొంత మంది చిన్న వయస్సులోనే పెద్ద వారిలా కనపడతారు. మరికొంత మంది వయస్సు పెద్దదైనా చిన్నవారి లా కనపడతారు. ఇదంతా తినే తిండి మీద మరియు వారి వంశ పారంపర్యం మీద ఆదారపడి ఉంటుంది. ఇప్పుడు యాంటీ ఏజింగ్‌ ఫుడ్స్‌ ఏమిటో చూద్దాం.

1/18 Pages

1. బ్లూ బెర్రీస్‌

బ్లూ బ్రెరీస్‌ లో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్‌ ఉండడం వలన ఆరోగ్యంగా ఉంచుతుంది. దీనిని రోజూ తినడం వల్ల ఆరోగ్యవంతులుగా తయారవుతారు. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్స్‌ వివిధ రకాల వ్యాధుల భారి నుండి రక్షిస్తుంది. అంతేకాకుండా దీనిలోని ఫైబర్‌ కంటెంట్‌ శరీరానికి కావలసిన విటమిన్స్‌ మరియు ముఖ్యమైన ఖనిజాలని అందజేస్తుంది. దీనివల్ల శరీరం యవ్వనంగా కనపడడంలో సహాయపడుతుంది.

English summary

You want to look younger then follow this diet to look younger. home remedies are available here.