యాంటీ టెర్రరిజం స్కూల్‌..

Anti-Terrorism School In China

05:06 PM ON 7th January, 2016 By Mirchi Vilas

Anti-Terrorism School In China

టెర్రరిజం.. ఉగ్రవాదం.. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న అతిపెద్ద సమస్య. అగ్ర రాజ్యం అమెరికా నుంచి మొదలుకుని పేద దేశం సోమాలియా వరకూ అన్నీ దీని బారిన పడుతున్నాయే. అందుకే ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేసేందుకు చైనాకు చెందిన ఓ విశ్వవిద్యాలయం కొత్త కోర్సుని ప్రారంభించనుంది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉగ్రవాదం నేపథ్యంలో కొత్తగా యాంటీ టెర్రరిజం స్కూల్‌ని ప్రారంభించబోతోంది. ఈ విషయాన్ని ఆ స్కూలు స్థాపనలో ప్రధాన భాగస్వామిగా ఉన్న జాంగ్‌ జింగ్‌ పింగ్‌ మీడియాకి వెల్లడించారు. చైనాలోని షాన్‌క్సి రాష్ట్రంలోని నార్త్‌ వెస్ట్‌ యూనివర్సిటీ ఆఫ్‌ పొలిటికల్‌ సైన్సెస్‌ అండ్‌ లా ఈ కోర్సును రూపొందించిందని తెలిపారు. ఈ కోర్సులో చేరేవారికి కౌంటర్‌ టెర్రరిజం తదితర ప్రత్యేక కోర్సుల్ని బోధిస్తామన్నారు. ఇటీవల కొత్తగా వస్తున్న ఉగ్రవాద వ్యతిరేక సిద్ధాంతాలు, ఈ దిశగా అమలవుతున్న పద్ధతులు తదితరాల్ని వారికి తెలియజేస్తామన్నారు. ప్రస్తుతం ఈ స్కూలులో అండర్‌ గ్రాడ్యుయేషన్‌లో చేరే వారి కోసం అడ్మిషన్లు జరుగుతున్నాయని చెప్పారు. తర్వాత మాస్టర్స్‌ డిగ్రీ, డాక్టరేట్‌లు కూడా ఇస్తామన్నారు.

English summary

A university in china will start a school on anti-terrorism courses to cash in on the growing demand for security personnel following the counter-terrorism law that came into effect from January 1.