యాక్సిడెంట్ లో యంగ్ హీరో మృతి... విషాదంలో ఫాన్స్

Anton Yelchin was died in car accident

10:15 AM ON 22nd June, 2016 By Mirchi Vilas

Anton Yelchin was died in car accident

ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందుతున్న వారి సంఖ్య బాగా పెరిగిపోతుంది. గణాంకాలు చూస్తే హడలు ఎత్తిపోయే పరిస్థితి. ముఖ్యంగా సినిమా స్టార్స్ రోడ్డు ప్రమాదం బారిన పడి మరణించిన ఘటనలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అతి తక్కువ వయస్సులోనే చాలా మంది అభిమానుల్ని సంపాదించుకున్న ఓ యువ హీరో కూడా తాజాగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు శోకసముద్రంలో మునిగిపోయారు. ఇంతకీ ఆ హీరో ఎవరంటే, ప్రముఖ హాలీవుడ్ సినిమా సీరీస్ స్టార్ ట్రెక్ హీరో అంటోన్ యెల్షిన్.

27 సంవత్సరాల యెల్షిన్ తనదైన కామెడీ మార్క్ పండిస్తూ ప్రేక్షకులను నవ్వించడంలో సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా అతడు నటించిన స్టార్ ట్రెక్ సీరీస్ ఆడియెన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. అలాంటి హీరో ఘోర కారు ప్రమాదంలో అంటోన్ ప్రాణాలను విడిచాడు. ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులతో పాటు హాలీవుడ్ సెలబ్రిటీలు సైతం దిగ్భ్రాంతి చెందారు.

English summary

Anton Yelchin was died in car accident