శంషాబాద్‌లో 'గిన్నీస్ బుక్' కార్గో విమానం

Antonov An 225 Mriya Landed In Hyderabad

01:11 PM ON 13th May, 2016 By Mirchi Vilas

Antonov An 225 Mriya Landed In Hyderabad

ప్రపంచంలోనే అతి పెద్ద విమానంగా గిన్నిస్‌ రికార్డు దక్కించుకున్న అతి పెద్ద కార్గో విమానం శుక్రవారం ఉదయం శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. సాధారణ కార్గో విమానాలతో పోల్చితే ఇది చాలా పెద్దది. ఇంకా ఎన్నో ప్రపంచ రికార్డులు సొంతం చేసుకుంది. ఉక్రెయిన్‌కు చెందిన ఈ విమానం పేరు ఆంటోనవ్‌ ఏఎన్‌-225 మ్రియా.

తుర్కిమినిస్థాన్‌ నుంచి ఆస్ట్రేలియా వెళ్తుండగా మార్గ మధ్యలో శంషాబాద్‌లో ఆగింది. ఇది 116 టన్నుల బరువైన జనరేటర్‌ను తీసుకెళ్తొంది. ఈ విమానానికి ఆరు టర్బో ఫ్యాన్‌ ఇంజన్లు ఉంటాయి. ప్రపంచంలో అత్యంత పొడవైన, బరువైన విమానం ఇదే. ఇది సుమారు 640 టన్నుల బరువును రవాణా చేయగలదు. ఏ విమానానికి లేనంత అతిపెద్ద రెక్కలు దీనికి ఉన్నాయి.

ఇవి కూడా చదవండి:అఖిల్ తో సినిమా తీయలేను అంటూ తప్పుకున్న డైరెక్టర్

ఇవి కూడా చదవండి:అందరి ముందు హీరోయిన్ బట్టలు విప్పించిన డైరెక్టర్

ఇవి కూడా చదవండి:రూమ్ కి అమ్మాయిలని పంపిస్తే బ్యాంకు లోన్ ఇచ్చేస్తాడట

English summary

World's Largest Flight Antonov An 225 Mriya Landed In Hyderabad at Shamshabad Airport Yesterday. This was the Biggest and Longest Aeroplane in the world and it was also in the book of Guiness Wolrd Records.