ఈసారి  తానే  తిరస్కరణ

Anupam Kher Rejected Pakistan Visa

01:26 PM ON 3rd February, 2016 By Mirchi Vilas

Anupam Kher Rejected Pakistan Visa

నిన్న పాకిస్తాన్ ప్రభుత్వం వంతు అయితే ఈసారి అనుపమ్ వంతు అయింది. నిన్న కాదని ఈరోజు ఇస్తాను రమ్మంటే ఎలా అనేమో వీసాను తిరస్కరిస్తున్నట్టు ప్రకటించాడు. వివరాలలోకి కరాచీ సాహిత్య ఉత్సవాల్లో పాల్గొనేందుకు బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ఖేర్‌ వీసాకు దరఖాస్తు చేసుకోగా.. అది తిరస్కరణకు గురైన సంగతి తెలిసిందే. అయితే మళ్ళీ అనుపమ్‌ఖేర్‌కి పాకిస్థాన్‌ వీసా ఆఫర్‌ చేసింది. అయితే.. ఆ ఆఫర్‌ని అనుపమ్‌ తిరస్కరించాడు. వీసా ఇస్తామంటూ పాక్‌ హైకమిషనర్‌ అబ్దుల్‌ బాసిత్‌ ట్వీట్‌ చేయడంతో, ఆ ట్వీట్‌కి స్పందించిన అనుపమ్‌.. ఆఫర్‌కి ధన్యవాదాలు తెలిపారు. కానీ ప్రస్తుతం తనకు డేట్స్‌ ఖాళీ లేవని దీంతో తాను పాకిస్థాన్‌ రావాలనుకోవడం లేదని అనుపమ్‌ రీట్వీట్‌ చేసాడు. దెబ్బకు దెబ్బ అంటున్నారు అభిమానులు.

English summary

Bollywood Actor Anupam Kher's request to Visa to participate in Film Festival in Karachi was rejected by Pakistan and now pakistan official said that they will they will Provide visa and Anupam Kher Rejected that Visa by saying that He was busy