అతన్ని చూసి పారిపోయిన హీరోయిన్

Anushka About Her Love Story

11:25 AM ON 4th May, 2016 By Mirchi Vilas

Anushka About Her Love Story

ఇటీవల ఒక టీవి ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో హీరోయిన్ అనుష్క కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పింది . తాను చిన్న తనంలో చాలా బాగా చదువుకునేదట. చదువు పై శ్రద్దతో తొలి ప్రేమ అనుభవాలకు ఆమె దూరం అయ్యిందని చెప్పుకొచ్చింది అనుష్క. తాను కాలేజి చదువుకునే రోజుల్లో అనుష్క వెంట ఒక అబ్బాయి వెంట పడేవాడట.అలా ఆ అబ్బాయి మొత్తానికి ఒక రోజు ధైర్యం చేసి అనుష్క దగ్గరకు వచ్చి అనుష్కను ప్రేమిస్తున్నాను అని చెప్పాడట. దీంతో అనుష్కకు ఏం చెయ్యాలో తెలియక భయపడి అక్కడి నుండి పరిగెత్తుకుని ఇంటికి పారిపోయిందట . ఆ తరువాత అనుష్క అతడి ఎప్పుడు కనిపిస్తాడా అని చాలా రోజులు చూసినప్పటికీ కనిపించలేదని చెప్పింది.

ఇవి కూడా చదవండి: పవన్ పెట్టుకున్న వాచ్ ఖరీదు ఎంతో తెలుసా?

ఇక తన మొదటి సినిమా అనుభవాలను చెబుతూ అనుష్క అసలు పేరు స్వీటీ నే అట కానీ ఆ పేరు బాగుండకపోవడంతో తన పేరు మార్చమని పూరి జగన్నాధ్ ను అడగగా పూరి జగన్నాధ్ అనుష్క అని మార్చాడట . యోగ గురువైన హీరోయిన్ భూమిక భర్త ఠాకూర్ ప్రోత్సాహం తో ఆయన దగ్గర యోగ నేర్చుకున్నానని , అసలు ఆయనే సూపర్ సినిమాకు పూరి జగన్నాధ్ కు తన పేరు ను సిఫార్సు చేసినట్లు అనుష్క చెప్పింది . అలా తన గురువు బలవంతం పై హైదరాబాద్ వచ్చి ఆడిషన్స్ లో పాల్గొందట . సినిమాలో డ్యాన్సులు చెయ్యలేక మధ్యలోనే మానేద్దామని అనుకుందట , కానీ పూరి జగన్నాధ్ , నాగార్జున ప్రోత్సాహంతోనే తాను నటిగా స్థిర పడ్డానని అనుష్క చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి:

మహేష్ కి ‘వచ్చింది కదా అవకాశం’

ఎక్కువసార్లు పెళ్ళి చేసుకున్న నటులు

కోర్టు ఆదేశంతో ఆగిపోనున్న వాట్సాప్ సేవలు

English summary

Tollywood Top Heroine Anushka Shetty said some her personal life incidents in an TV Interview. She said that She used to study very well at her childhood and One day when she was in college one guy proposed her and then she ran away from that place to her home. She said that Puri Jagannadh remaned her As Anushka.