నా లక్ష్యం నెరవేరినట్లే.....

Anushka About Her Movie Career

10:17 AM ON 8th February, 2016 By Mirchi Vilas

Anushka About Her Movie Career

ఎన్ని పాత్రలు వేసినా ఇంకా ఏదో చేయాలన్న తపన, అది నెరవేరకపోతే తెగ బాధ పడిపోవడం చాలామంది నటీ నటుల్లో చూస్తుంటాం. మరికొంతమంది అయితే, మన రాత అలా రాసి ఉందంటూ బాధపడిపోయే వాళ్ళూ ఎక్కువే. కానీ, విభిన్న పాత్రలతో తనదైన ముద్ర వేసి, ప్రస్తుతం ‘బాహుబలి - ది కన్‌క్లూజన్‌’తోపాటు, ‘సింగం 3’లో నటిస్తోన్న అందాల నటి అనుష్క మాత్రం వేరే విధంగా ఆలోచిస్తుంది. అందుకే మనం అనుకుంటే మన తలరాతను తిరగ రాసుకోగలం అంటోంది. సంకల్పం ఉంటే విధి కూడా మనం చెప్పినట్టే వింటుందని భరోసా కూడా ఇస్తోంది. ఇక 'కష్టమొస్తే దాన్ని ఎదుర్కొనే ధైర్యం కూడగట్టుకోవాలి. ఆ ధైర్యం మనలో ఉందంటే కష్టం కూడా చిన్నబోతుంది. విధి, రాత' అంటూ మనం కుంగిపోతే చిన్న సమస్య కూడా పెద్దదిగా అయిపోతుంది' అని కూడా లెక్చర్ లు ఇస్తోంది ఈ భామ. నటిగా లక్ష్యాలేమైనా ఉన్నాయా? అంటే ‘‘నటిని అవుదామన్న ఆలోచనే లేకుండా పరిశ్రమలోకొచ్చా. ఇక నాకు లక్ష్యాలేం ఉంటాయి? మరో పది, ఇరవయ్యేళ్ల అయినా సరే, గర్వంగా చెప్పుకునే కొన్ని సిన్మాలు చేశాను. అందుకే నా లక్ష్యం నెరవేరినట్టు భావిస్తుంటా’’ అని అనుష్క ముసిముసి నవ్వులు చిందిస్తూ చెప్పేస్తోంది. అవును మరి ఓ పక్క బాహుబలి- రుద్రమ దేవి లాంటి యాక్షన్ చిత్రాలు , మరోపక్క రొమాన్స్ పండించే చిత్రాల్లో నటిస్తూ దూసుకుపోతున్న అనుష్క రాత బానే ఉందిగా .

English summary

South Top Heroine Anushka now presently acting in Bahubali-The Conclusion and in Singam-3 along With Hero Surya. Anushka Says That if we have talent we can change our fate.Anushka Acted in Historic films like Bahubali,Rudrama devi movies become a super hit in recent days