మళ్లీ సైజ్‌జీరోకి అనుష్క

Anushka Back With Weight Loss

10:49 AM ON 17th May, 2016 By Mirchi Vilas

Anushka Back With Weight Loss

‘సైజ్ జీరో’ మూవీ కోసం అమాంతంగా 20 కిలోలు బరువు పెరిగిన తర్వాత కనిపించడం మానేసిన దేవసేన అనుష్క చాన్నాళ్లు తర్వాత ఒక్కసారిగా బయటకు వచ్చింది. ఈలోగా వెయిట్‌ తగ్గించుకునే పనిలోపడిందట. ఓవైపు యోగా, మరోవైపు డ్యాన్స్, ఇంకోవైపు జిమ్ ఇలా తన బరువును.. దేవసేన రోల్‌కి సరిపోయేలా రెడీ అయ్యింది. కొద్దిరోజులుగా షూటింగ్‌లకు దూరంగావున్న ఈ స్వీటీ, బెంగళూరులోని తన ఇంట్లో జరిగే ఓ వేడుకకు హాజరైంది. ఆ సందర్భంగా కుటుంబసభ్యులతో కలిసి దిగిన పిక్స్‌ను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది. ఈ ఫోటోను చూసిన అభిమానులు, మార్పు స్పష్టంగా కనిపించిందని అంటున్నారు. ఫొటో చూస్తే అనుష్క బరువు తగ్గి మునుపటి రూపానికి వచ్చేసిందంటున్నారు. రేపోమాపో ‘బాహుబలి 2’ సెట్స్‌కి దేవసేన హాజరు కావచ్చునని టాక్ నడుస్తోంది. మరోపక్క మెగా స్టార్ 150వ సినిమా కత్తిలాంటోడు చిత్రం కోసం ఈ అమ్మడు ఎంపికయినట్లు కూడా వార్తలు వచ్చాయి.

ఇవి కూడా చదవండి: అబ్బో , బూతు చూస్తే భక్తి పొంగిపోతుందట.?

ఇవి కూడా చదవండి:బాయ్ ఫ్రెండ్స్ తో చాటింగ్ వద్దన్నందుకు భర్త వేళ్లను కోసేసింది

English summary

Most Talented Heroine in South Film Industry Anushka Shetty was increased her weight up to 20 kgs for Size Zero movie and Now She was in work of decreasing weight. Recently she posted her photo in social media and she waslooking slim in the photo.