అలాంటి వాళ్లకు దూరంగా ఉంటా  

Anushka Dont Like Such People

10:15 AM ON 29th January, 2016 By Mirchi Vilas

Anushka Dont Like Such People

సాదారణంగా పొగడ్తలకు పడిపోనివారెవరు వుండరు. అందులో సినీ భామలైతే మరీనూ. అయితే ఇలాంటివి నా దగ్గర అసలు పనిచేయవు అంటోంది అనుష్క. అసలు అలా పొగిడేవాళ్లముందు నిలబ డాలన్నా, వాళ్లతో మాట్లాడాలన్నా ఇబ్బందిగా ఫీల్ అవుతుందట. కొంతమంది చెప్పే మాటలను ఆమె ప్రస్తావించింది. 'నీ నవ్వు ఫలానా కథానాయికలా ఉంది, నీ నటన చూస్తుంటే ఆమె గుర్తొస్తుంది అని ఏవోవే చెప్తుంటారు. ‘కరీనాకపూర్‌’లా ఉన్నావు అని చాలామంది చెప్తుంటారు. నిజం చెప్పాలంటే ఈ మాట విన్నప్పుడు మనసులో కొంచెం గర్వం తొణికిసలాడుతూ వుంటుంది. అదే సమయంలో ఇబ్బందిగానూ ఉంటుంది. విమర్శలైనా, కితాబులైనా ఎంత వరకూ తీసుకోవాలో నాకు తెలుసు. ముఖ్యంగా నేను దేన్నీ సీరియస్‌గా పట్టించుకోను’’ అని అనుష్క అంటోంది. ‘‘విమర్శించే వాళ్ల మాటల్ని శ్రద్ధగా వింటానుగానీ, పొగిడేవాళ్లతో ఇబ్బందే. అలాంటప్పుడు ఎలా స్పందించాలో అర్థం కాదు. సాధ్యమైనంతవరకూ అలాంటివాళ్లకు దూరంగా ఉంటూ ఉంటా’’ అంటోంది.

English summary