శివపుత్రుడు డైరెక్షన్‌లో అనుష్క!

Anushka in Bala Direction

12:07 PM ON 20th November, 2015 By Mirchi Vilas

Anushka in Bala Direction

శివపుత్రుడు, నేను దేవుణ్ణి, వాడు-వీడు వంటి రియల్‌ టైప్‌ సినిమాలు చేసిన దర్శకుడు బాల ఇప్పుడు మరో రియల్‌స్టిక్‌ చిత్రంతో మన ముందుకు రాబోతున్నాడు. అదే 'తారై తప్పట్టై'. ఇందులో రాధిక, శరత్‌కుమార్‌ల గారాల కుట్టి వరలక్ష్మి శరత్‌కుమార్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలే షూటింగ్‌, ప్రీ ప్రొడెక్షన్‌ పనులు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా తమిళంలో విడుదల చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ పూర్తికాగానే బాల ఒక భారీ బడ్జెట్‌ మల్టీస్టారర్‌ చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఇందులో ఆర్య, విశాల్‌, రానా, అరవింద్‌స్వామి, అధర్వలను హీరోలుగా ఎంపిక చేసి అధికారికంగా ప్రకటించారు కూడా. అయితే ఈ చిత్రంలో ప్రధాన హీరోయిన్‌ క్యారక్టర్‌కు అనుష్కని సంప్రదించారు. కథ నచ్చడంతో, దర్శకుడు బాల కావడంతో అనుష్క గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని సమాచారం. అంటే 5 మంది ఉన్న హీరోలకి అనుష్క ఏ మెయిన్‌ హీరోయిన్‌గా కనిపించడం విశేషం. ఈ సినిమా షూటింగ్‌ను సంక్రాంతికి సెట్స్‌పైకి తీసుకువెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు.

English summary

Anushka in Bala Directionq