'చంద్రముఖి 2' లో అనుష్క

Anushka in Chandramukhi 2

05:49 PM ON 24th May, 2016 By Mirchi Vilas

Anushka in Chandramukhi 2

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించి.. తెలుగు, తమిళంలో విడుదలైన చిత్రం 'చంద్రముఖి'. దాదాపు విడుదలైన అన్ని భాషలలోనూ అఖండ విజయం సాధించింది ఈ సినిమా. వివిధ భాషల్లో కీలకమైన చంద్రముఖి పాత్ర శోభన, సౌందర్య, జ్యోతిక తమ నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. అయితే ఈ సినిమాకు ప్రీక్వెల్ గా తెరకెక్కించిన 'నాగవల్లి' సినిమా ఆశించిన మేరకు విజయం సాధించలేదు. నాగవల్లి పాత్రలో నటించిన అనుష్క కూడా అంతగా మెప్పించలేకపోయింది. దర్శకుడు పి. వాసు కూడా తన మార్కుని చూపించలేకపోయాడు. ఇప్పుడు వీరికి మరో అవకాశం వచ్చింది.

'చంద్రముఖి 2' అంటూ ఆ సినిమాకు సీక్వెల్ ని తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఇప్పటికే మలయాళంలో 'శివలింగా' పేరుతొ ఈ సినిమా విడుదలైంది. తెలుగు తమిళ భాషల్లో ఈ సినిమాను పి. వాసు తెరకెక్కిస్తాడని కీలకమైన చంద్రముఖి పాత్రలో అనుష్క నటిస్తుందని లారెన్స్ కి కూడా మంచి పాత్ర ఉందని సమాచారం.

English summary

Anushka in Chandramukhi 2