భక్తురాలు కృష్ణమ్మ గెటప్ లో అనుష్క ..

Anushka In Om Namo Venkatesaya

03:05 PM ON 6th August, 2016 By Mirchi Vilas

Anushka In Om Namo Venkatesaya

కొన్ని పాత్రలు కొందరు వేస్తేనే అందం .. చూడ్డానికి కూడా ముచ్చటగా ఉంటుంది ... అందుకే హీరోయిన్ అనుష్క మహా భక్తురాలు కృష్ణమ్మగా అలరించనుంది. ఎందుకంటే, ఈమె ఇప్పటికే అరుంధతి, రుద్రమదేవి దేవసేన వంటి పౌరాణిక పాత్రలను పోషించి, మెప్పించింది. ఈ టాప్ హీరోయిన్ ఇప్పుడు నాగార్జున ప్రధాన ప్రాతలో రూపొందుతున్న ''ఓం నమో వేంకటేశాయ'' సినిమాలో ఒక ప్రత్యేక పాత్రలో నటిస్తోంది.

ఇప్పటికే ఈ సినిమాలో బాలీవుడ్ సీరియల్స్ నటుడు సౌరభ పోషిస్టున్న శ్రీమహా విష్ణువు పాత్రను మోషన్ పోస్టర్ ద్వారా ఆవిష్కరించిన దర్శకుడు కె.రాఘవేంద్రరావు ఇప్పుడు అనుష్క పాత్ర ఎలా ఉండబోతోందో ఒక టీజర్ రిలీజ్ చేశారు. ఒక మహా భక్తురాలు ఎలా ఉంటుందో అచ్చం అలాగే ఉంది అనుష్క. అయితే కృష్ణమ్మ అనే పేరుతో కలియుగ అవతారమైన వేంకటేశ్వరుని భక్తురాలిగా కనిపించడం ఇంకా బాగుందని డివోషనల్ సినిమా లవర్స్ అంటున్నారు.

ఇప్పటికే రాఘవేంద్రరావు డైరక్షన్లో అన్నమయ్య శ్రీరామదాసు శ్రీసాయిబాబా వంటి సినిమాలను చేసిన నాగ్ ఈ సినిమాలో 'హతీ రామ్ బాబా' పాత్రలో నటిస్తున్నారు. నవతరం దేవుళ్ళ సినిమాల కథానాయకుడిగా ఈ సినిమాతో నాగ్ కి వీర లెవెల్లో క్రేజ్ వచ్చినా, ఆశ్చర్య పడక్కర్లేదు. ఎందుకంటీ అభిమానులు ఏంటో ఆతృతగా అభిమానులు ఎదురు చూస్తున్నారు.

ఇది కూడా చూడండి: గతజన్మలో ప్రేమించిన వ్యక్తిని.. ఇప్పుడు కలిశామని చెప్పే సంకేతాలు

ఇది కూడా చూడండి: రాత్రి పడుకొనే ముందు చేయవలసిన 10 పనులు

ఇది కూడా చూడండి: ఇండియాలో భయంకరమైన ప్రదేశాలు

English summary

Anushka In Om Namo Venkatesaya. Anushka Acts as Krishnamma in Om Namo Venkatesaya film.