సన్యాసం తీసుకుంటున్న అనుష్క.. ఎందుకో తెలుసా?

Anushka is acting as a Monk

04:12 PM ON 13th June, 2016 By Mirchi Vilas

Anushka is acting as a Monk

అరుంధతి చిత్రంతో తెలుగులో మళ్లీ లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు ఊపిచ్చింది సైజ్ జీరో బ్యూటీ అనుష్క. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో ఆ తరువాత పంచాక్షరి, వర్ణ, నాగవల్లి, రుద్రమదేవి వంటి లేడీ ఓరియెంటెడ్ పాత్రల చిత్రాల్లో నటించి టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా మారిపోయింది. అనుష్క ప్రస్తుతం బాహుబలి 2, సింగం 3 వంటి చిత్రాల్లో హీరోయిన్ గా నటిస్తుంది. ఇవి కాకుండా తాజాగా భాగమతి అనే చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదిలా ఉంటే ఇప్పుడు నాగార్జున నటిస్తున్న హతిరాం బాబా బయోపిక్ చిత్రంలో కూడా నటిస్తుంది. ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, విమలా రామన్ కూడా ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.

అయితే ఇప్పుడు ఇందులో అనుష్క చెయ్యబోతున్న పాత్ర గురించి సమాచారం అందింది. మాకు అందిన సమాచారం ప్రకారం అనుష్క ఇందులో సన్యాసిగా కనిపిస్తుందట. ఈ చిత్రానికి దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు తెరకెక్కిస్తున్నారు. మరి అనుష్కని సన్యాసిగా రాఘవేంద్రరావు ఎలా చూపిస్తాడో అని ప్రేక్షకుల్లో ఇప్పటినుంచే ఆసక్తి నెలకొంది.

English summary

Anushka is acting as a Monk