రుద్రాక్ష నుండి అనుష్క ఔట్‌!

Anushka is not acting in krishna Vamsi movie

06:39 PM ON 27th November, 2015 By Mirchi Vilas

Anushka is not acting in krishna Vamsi movie

అనుష్క కధానాయికగా భారీ గ్రాఫిక్స్‌తో కృష్ణవంశీ రుద్రాక్ష అనే చిత్రం చేస్తున్నాడని చాలా కధనాలు వినిపించాయి. ఈ చిత్రానికి దిల్రాజు ఏ నిర్మాత అని, కృష్ణవంశీ ఈ చిత్రానికి రుద్రాక్ష అని టైటిల్‌ ఫిక్స్‌చేస్తే ఆ టైటల్ని వేరే ఎవరో రిజిస్టర్‌ చేశారని ఎన్నో కధనాలు వచ్చాయి. వీటన్నిటిని ఇప్పుడు తెర దించుతూ తాజా సమాచారం వినబడతుంది. ఈ ప్లేస్‌లోకి ఇప్పుడు వేరే ప్రొజెక్ట్‌ వచ్చింది, కృష్ణవంశీ-దిల్‌రాజు కాంబినేషన్‌లో రాబోతున్న ఈ చిత్రంలో ఐదుగురు హీరోలు, ఇద్దరు హీరోయిన్స్‌ ఉంటారట. అయితే ఇందులో అనుష్క నటిస్తుందో లేదో అనేది స్పష్టంగా తెలీదు.

ఈ చిత్రం మైధలాజికల్‌ ... ఆ? ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌....ఆ? సోషియోఫాంటసీ...ఆ? అన్న విషయం కూడా ఇంకా తెలీదు. కృష్ణవంశీ, దిల్‌రాజు నోరు విప్పితే తప్ప ఈ సినిమా పై స్పష్టత తెలీదు.

English summary

Anushka is not acting in krishna Vamsi movie which was producing by Dil Raju.