చిరంజీవికి హ్యాండ్ ఇచ్చిన అనుష్క!

Anushka is out from Chiranjeevi 150th movie

03:29 PM ON 1st June, 2016 By Mirchi Vilas

Anushka is out from Chiranjeevi 150th movie

మెగాస్టార్ చిరంజీవి నటించనున్న 150వ చిత్రం గురించి అందరికీ తెలిసిందే. దాదాపు 8 సంవత్సరాలు తరువాత చిరంజీవి నటిస్తున్న ఈ చిత్రానికి వి.వి. వినాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. తమిళంలో సూపర్ హిట్ అయిన కత్తి చిత్రానికి ఇది రీమేక్. దేవిశ్రీప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ మాత్రం ఇంకా ఖరారు కాలేదు. అసలు విషయంలోకి వెళ్తే.. ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతారని తీసుకుంటున్నట్లు ప్రకటించినా ఆ వార్తలు నిజం కాదని తేలిపోయాయి. దాదాపు నయనతార కన్ఫామ్ అయిందన్న టాక్ వినిపించింది.

కానీ చివరి నిమిషంలో నయనతార ఈ సినిమాలో నటించడంలేదని తేలిపోయింది. ఆ తరువాత టాలీవుడ్ టాప్ హీరోయిన్ అనుష్క కధానాయికగా నటిస్తుందని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు అనుష్క కూడా చిరంజీవికి హ్యాండ్ ఇచ్చిందట. ప్రస్తుతం బాహుబలి 2, సింగం 3, భాగమతి సినిమాల్లో నటిస్తున్న అనుష్క ఇంత టైట్ షెడ్యూల్ లో చిరు సినిమాకు డేట్స్ ఎడ్జస్ట్ చేయలేనని చెబుతోందట. మరో వారంలో సెట్స్ మీదకు వెళుతుందనుకున్న మెగాస్టార్ మూవీ ఇప్పుడు మరోసారి హీరోయిన్ వేటకు రెడీ అవుతోంది. రోజు రోజుకీ సినిమా ఏదో ఒక కారణంతో వాయిదా పడుతుండటంతో..

రామ్ చరణ్ 'ధ్రువ' ప్రాజెక్టు మీద కూడా ఈ ప్రభావం పడుతోండటంతో పాటు, ఇప్పటికే డేట్లు ఇచ్చేసిన నటులు తీరా ఈ షూటింగ్ మొదలయ్యే సమయానికి వేరే పనుల్లో ఇరుక్కుపోతున్నారు. మరి మెగాస్టార్ రీ-ఎంట్రీకి సరైన స్వాగతం చెప్పటానికి ఏ హీరోయిన్ ఎంపిక అవుతుందో చూడాలి మరి.

English summary

Anushka is out from Chiranjeevi 150th movie