శరీరాన్ని ప్రేమించమంటున్న అనుష్క

Anushka Says Important to love, respect your body

06:33 PM ON 24th November, 2015 By Mirchi Vilas

Anushka Says Important to love, respect your body

శరీరాన్ని ప్రేమించడం , గౌరవించడం చాలా ముఖ్యమని హీరోయిన్ అనుష్క శెట్టి అంటోంది.

అనుష్క తను నటిస్తున్న " సైజు జీరో " చిత్రంలో ఊబకాయం ఉన్న స్త్రీ పాత్రలో కనిపించనుంది ఇందు కోసం అనుష్క ఏకంగా 20 కేజీ ల బరువు కూడా పెరిగింది. తెలుగు తమిళ బాషలలో ఒకేసారి విడుదల కాబోతున్న ఈ చిత్రం గురించి అనుష్క మాట్లాడుతూ తన దృష్టి లో ఫీట్ గా ఉండడం అంటే శారీరకంగా అందంగా కనిపించడం కాదని , మానసికంగా ఆరోగ్యంగా ఉండడం అని అంటోంది. శారీరకంగా దృడంగా కనిపించడం కోసం డైట్ పాటించడం, విపరీతమైన వ్యాయామాలు చెయ్యడం మంచిది కాదని చెప్తుంది. శరీరాన్ని ప్రేమించడం , గౌరవించడాన్ని తెలుసుకునప్పుడే మన శరీరానికి ఏం కావాలో తెలుస్తుందని అనుష్క అంటోంది.

సైజు జీరో సినిమా కోసం దాదాపు 20 కేజి ల బరువు పెరగడంతో తన కాళ్ళ పై అదనపు భారం పడడంతో కాళ్ళు నొప్పులు విపరీతంగా రావడంతో చాలా ఇబ్బంది పడ్డానని అనుష్క చెబుతోంది. బాహుబలి 2 వ పార్టు కోసం బరువు తగ్గే పనిలో ఉన్నానని ఇంకా 7-8 కేజిల బరువును తగ్గించాల్సి ఉన్నట్లు అనుష్క చెబుతోంది.

అనుష్క , ఆర్య ,అడవి శేష్,సోనాల్ చౌహాన్ కీలక పాత్రలలో నటించిన సైజు జీరో చిత్రం మంచి విజయాన్ని అందుకుంటుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేసింది.

English summary

South Indian Actress Anushka Shetty says that she believes that when you love and respect your body, you will be able to crack the secret to staying fit.