ప్రొడ్యూసర్‌ అవతారమెత్తిన 'కోహ్లి' ప్రేయసి!!

Anushka Sharma became a producer with NH10 movie

03:56 PM ON 9th December, 2015 By Mirchi Vilas

Anushka Sharma became a producer with NH10 movie

బాలీవుడ్‌ బ్యూటీ అనుష్కశర్మ అనతి కాలంలోనే బాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్లలో ఒకరిగా పేరు సంపాదించుకుంది. తన నటనతోనూ, అందంతోనూ ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకుంది. ఇండియన్‌ క్రికెట్‌ ప్లేయర్‌ విరాట్‌ కోహ్లితో ప్రేమాయణం సాగిస్తూ లైఫ్‌ బాగా ఎంజాయ్‌ చేస్తుంది. అనుష్కశర్మ ఈ ఏడాది విడుదలైన 'ఎన్‌హెచ్‌ 10' చిత్రంలో అనుష్క నటించడంతో పాటూ నిర్మాతగా కూడా వ్యవహరించింది. ఈ చిత్రం సూపర్‌ హిట్‌ కావడంతో మరో ముగ్గురు దర్శకులని లైన్లో పెట్టింది. ఇందులో ఒకరు 'ఎన్‌హెచ్‌ 10' కి దర్శకత్వం వహించిన నవదీప్‌ సింగ్‌ కాగా, మరో ఇద్దరు కొత్త దర్శకులు అన్షాయ్‌ లాల్‌ మరియు అక్షత్‌ వర్మ.

మరొకటి కరణ్‌ జోహార్‌ తెరకెక్కిస్తున్న 'యే దిల్‌ హై ముష్కిల్‌' చిత్రంలో రణబీర్‌ కపూర్‌ సరసన నటించడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరిస్తుంది అనుష్కశర్మ. అనుష్క మాట్లాడుతూ మంచి చిత్రాలను నిర్మించడం నాకు ఎంతో సంతృప్తి, ఆనందంగా ఉంది. ఇలాగే మంచి చిత్రాలను నిర్మించాలని కోరుకుంటున్నాను అని చెప్పుకొచ్చింది.

English summary

Anushka Sharma became a producer with NH10 movie. Now she is producing another 3 movies.