అనుష్క ఆ గేమ్ ఆడేస్తోంది బాబోయ్

Anushka Sharma Enjoys By Playing Pokemon Go Game

10:51 AM ON 28th July, 2016 By Mirchi Vilas

Anushka Sharma Enjoys By Playing Pokemon Go Game

సినిమాలు - ఈవెంట్లతో తెగ బిజీగా ఉండే బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మకి కొత్త కంపెనీ దొరికేసింది. అనుష్క ఖాళీ సమయంలో ఏం చేస్తుందో ఇంతకుముందైతే తెలీదు కానీ.. ఇప్పుడు తనే చెప్పేసింది.

ఇప్పటికే షారూక్ ఖాన్ - వరుణ్ ధావన్ లాంటి స్టార్స్ అంతా పోకెమాన్ గో ను ఆడేసి ఓ ప్రయోగం చేసేశారు. ఇఫ్పుడా లిస్ట్ లోకి అనుష్క కూడా చేరిపోయింది. ప్రపంచం మొత్తాన్ని ఊపేస్తోన్న పోకెమాన్ గో గేమ్ ని అనుష్క ఆడేస్తోంది. వర్చువల్ రియాలిటీ ఆధారంగా రూపొందించిన ఈ గేమ్ కి ఇంటర్నేషనల్ గా క్రేజ్ ఏర్పడిన విషయం తెలిసిందే. ఇక ఈ గేమ్ వలన ఏక్సిడెంట్లు కూడా బానే జరుగుతున్నాయి. ఆ గేమ్ ను ఇన్ స్టాల్ చేసేసుకుని అనుష్క ఆడేస్తోంది. అంతే కాదు..ఆ గేమ్ ఆడుతూ తను ఎంతగా ఎక్సైట్ అవుతోందో.. ఆ విషయాన్ని కూడా ఆన్ లైన్ లో పెట్టేసింది. గతంలో అనుష్క శర్మ తన ప్రియుడు కోహ్లీతో కలిసి చక్కర్లు కొట్టేది. ఎక్కడ మ్యాచులు జరిగితే అక్కడికి వెళ్లిపోయి హంగామా చేసేది. ఇప్పుడా స్పీడ్ తగ్గింది.

పైగా విరాట్ కూడా వెస్టిండీస్ టూర్ లో బిజీగా ఉన్నాడు. మరో నెల్లాళ్లు ఇండియాకొచ్చే ఛాన్స్ లేదు. అందుకే ఈ టైమ్ లో పోకెమాన్ గో గేమ్ తో అనుష్క శర్మ టైమ్ గడిపేస్తోంది. ఆ గేమ్ ఆడుతూ అనుష్క కళ్లలో కనిపిస్తున్న ఆశ్చర్యం చూస్తే.. కొత్త కంపెనీని ఇప్పట్లో వదిలిపెట్టేట్లు అని సినీ లవర్స్ కామెంట్స్ పెట్టిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:'సర్దార్' కిరాయిలకోసం పవన్ కారు అమ్మేశాడు?

ఇవి కూడా చదవండి:కత్తిలాంటోడు 'నెపోలియన్' అయ్యాడా!

English summary

Bollywood Heroine Anushka Sharma Enjoys by Playing Popular Game Pokemon Go and she shares her happiness and joy through social media.