హ్యపీగా ఫీలవుతున్న 'అనుష్క శర్మ'!!

Anushka Sharma feel exciting to act with Salman Khan

02:47 PM ON 23rd January, 2016 By Mirchi Vilas

Anushka Sharma feel exciting to act with Salman Khan

బాలీవుడ్‌ అందాల హీరోయిన్‌ అనుష్క శర్మ ఫుల్‌ ఖుషీగా ఉంది. బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ఖాన్‌ తో జంటగా నటించే అవకాశం రావడంతో చాలా సంతోషంగా ఉందట. సల్మాన్‌ఖాన్‌ రాబోయే సినిమా 'సుల్తాన్‌' లో హీరోయిన్‌ గా నటించే ఛాన్స్ అనుష్క శర్మ కొట్టేసింది. ఇప్పటివరకు చేసిన సినిమాల్లో అద్భుతంగా నటించి అందరి ప్రసంసలూ అందుకుంది. ఇప్పుడు 'సుల్తాన్‌' సినిమాలో తను చేయబోయే పాత్ర కోసం బాగా ప్రిపేర్‌ అవుతుందట. మొదట్లో దీపిక పదుకునే, కంగనా రనౌత్, పరిణితి చోప్రా, కృతి సనన్‌ లని ఈ సినిమాకి హీరోయిన్‌ గా అనుకున్నారు. కానీ వీరందరినీ దాటుకుని అనుష్క శర్మ ఈ ఛాన్స్ కొట్టేసింది.

అనుష్క ఇప్పటివరకూ అమీర్‌, షారూక్‌ లాంటి స్టార్‌ హీరోలతో జతకట్టింది కానీ సల్మాన్‌ఖాన్‌ తో నటించడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం సుల్తాన్‌ సినిమా ఘాటింగ్‌ లో అనుష్క బిజీగా ఉంది. ఈ సినిమా హర్యానాకి చెందిన కుస్తీ ఫైటర్‌ 'సుల్తాన్‌ అలీఖాన్‌' జీవిత కధ ఆధారంగా తెరకెక్కుతుంది. ఈ సినిమాకి అలీ అబ్బాస్‌ జాఫెర్ దర్శకత్వం వహిస్తున్నారు.

English summary

Anushka Sharma feel exciting to act with Salman Khan in Sultan movie. This is the real story of Sultan Ali Khan.