సల్మాన్ చెంప పగలగొట్టిన అనుష్క

Anushka Sharma slaps Salman Khan

10:47 AM ON 9th February, 2016 By Mirchi Vilas

Anushka Sharma slaps Salman Khan

బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌ని చెంప పై కొట్టింది అనుష్కశర్మ. అవును నిజంగా ఈ కండలవీరుడు చెంప చెల్లుమనిపించింది ఈ సుందరి. కానీ ఇది నిజ జీవితంలో కాదు రీల్‌ జీవితంలో. ప్రస్తుతం సల్మాన్‌ఖాన్‌ 'సుల్తాన్‌' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో అనుష్కశర్మ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రంలో అనుష్క సల్మాన్‌ చెంప చెల్లుమనిపించే సన్నివేశం ఒకటి ఉందట. ఆ సన్నివేశం సినిమాకి ఎంతో అవసరమట. కానీ అనుష్క అంత పెద్ద స్టార్ హీరోతో అటువంటి సన్నివేశంలో నటించడానికి నిరాకరించిందట. కానీ దర్శకుడు ఈ సన్నివేశం ఈ కథకి చాలా అవసరం అని ఒప్పించారట.

అయినా అనుష్క చాలా ఇబ్బంది పడిందట. దీనితో సల్మాన్‌ కూడా ధైర్యం చెప్పి ప్రోత్సాహించడంతో అనుష్క ఆ సన్నివేశంలో నటించిందట. అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వం వహిస్తున్న 'సుల్తాన్‌' చిత్రాన్ని యశ్‌రాజ్‌ ఫిలింస్‌ సంస్థ నిర్మిస్తుంది.

English summary

Bollywood hot beauty Anushka Sharma slaps Salman Khan in Sultan movie. Ali Abbas Jaafar is directing this movie.